నాన్న ఆ రోజు రూ.500 లు ఇచ్చి చెప్పిన మాటలు

నాన్నగారు చెప్పినట్లుగానే ఆ రూ.500లను పేదవారికి ఫుడ్‌ కోసం అప్పట్లో ఇచ్చాను. ఆ సమయంలో నేను 5వ తరగతి చదువుతున్నాను.

Update: 2024-11-05 10:30 GMT

దీపావళి అనగానే దాదాపు అందరూ టపాసులు పేల్చి తమ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ దీపావళి వల్ల ఎంత కాలుష్యం పెరుగుతుంది అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ విషయం తెలిసిన కొందరు మనం ఒక్కరం టపాసులు కాల్చుకుంటే వాతావరణ కాలుష్యం కాకుండా ఆగుతుందా అని వారు సైతం టపాసులు పేల్చడం జరుగుతుంది. కానీ అతి కొద్ది మంది మాత్రమే టపాసులు పూర్తిగా దూరం పెట్టి పండుగ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారిలో టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ ముందు వరుసలో ఉంటుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

ప్రతి దీపావళిని తాను టపాసులు లేకుండానే కేవలం స్నేహితులతో స్వీట్స్ షేర్‌ చేసుకుంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, బహుమానాలు ఇచ్చుకుంటూ సెలబ్రేట్‌ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. దీపావళికి టపాసులు కాల్చక పోవడంకు కారణం ఏంటి అనే ప్రశ్నకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందిస్తూ... చాలా సంవత్సరాల క్రితం ఒక దీపావళి రోజు మా నాన్న నన్ను పిలిచి రూ.500 ఇచ్చారు. ఆ డబ్బుతో నేను చాలా టపాసులు కొనుక్కోవాలి అనుకున్నాను. కాని నాన్న అప్పుడు నువ్వు ఆ డబ్బుతో టపాసులు కొనుక్కొని కాలుస్తావు. దాని వల్ల వాతావరణం ఎంత కాలుష్యం అవుతుందో నీకు తెలుసా.. అదే ఆ డబ్బును పేదవాడి ఆకలి తీర్చేందుకు వినియోగిస్తే ఎంత బాగుంటుంది అన్నారు.

నాన్నగారు చెప్పినట్లుగానే ఆ రూ.500లను పేదవారికి ఫుడ్‌ కోసం అప్పట్లో ఇచ్చాను. ఆ సమయంలో నేను 5వ తరగతి చదువుతున్నాను. నాన్న ఆ రోజు రూ.500 లు ఇచ్చి చెప్పిన మాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. అందుకే నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దీపావళి కి టపాసులు కాల్చలేదు. ముందు ముందు కూడా టపాసులు నేను కాల్చను.. నా సన్నిహితులకు సైతం టపాసుల వల్ల కలిగే వాతావరణ కాలుష్యం గురించి వివరించి వారు కూడా టపాసులు కాల్చకుండా చూసుకుంటాను అంది.

5వ తరగతిలో ఉన్న సమయంలో తండ్రి చెప్పిన మాటను తలకు ఎక్కించుకుని అప్పటి నుంచి టపాసులు కాల్చుకుండా ఉంటున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను ఎంతగా అభినందించినా తక్కువే అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఆమె వ్యాఖ్యలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్‌ లాగే అంతా వాతావరణం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే రకుల్‌ కి బ్యాడ్‌ కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా రకుల్‌ ప్రీత్‌ సింగ్ నిజంగా క్రాకర్స్ ను అప్పటి నుంచి కాల్చకుండా ఉంటే మాత్రం చాలా గొప్ప విషయం అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News