భర్తను మిస్‌ అయినప్పుడు రకుల్‌ ఏం చేస్తుందో చూడండి..!

ఇటీవలే ఈ అమ్మడు మేరే హస్బెండ్ కీ బివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2025-02-25 05:38 GMT

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గత ఏడాది ఫిబ్రవరి 21న ప్రియుడు జాకీ భగ్నానితో వివాహ బంధంలో అడుగు పెట్టింది. ఇటీవలే రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాకీ భగ్నాని మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. గతంలో మాదిరిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ వరుస సినిమాలతో బిజీగా లేదు. టాలీవుడ్‌లో ఈ అమ్మడు సినిమాలు చేయడం లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి. ఇటీవలే ఈ అమ్మడు మేరే హస్బెండ్ కీ బివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఇంకా థియేటర్‌లోనే ఉంది. అప్పుడే మరో సినిమా షూటింగ్‌లో రకుల ప్రీత్‌ సింగ్‌ పాల్గొంటుంది. హిందీ సినిమా దే దే ప్యార్‌ దే 2 సినిమా షూటింగ్ నిర్మాణ దశలో ఉంది.


ఇటీవల రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. గత కొన్ని రోజులుగా మేరే హస్బెండ్ కీ బివి సినిమాకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ ప్రమోట్‌ చేస్తూ వచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా భర్తను మిస్ అవుతున్నట్లు పోస్ట్‌ షేర్ చేసింది. ఎప్పుడైనా భర్తను మిస్‌ అయితే అతడి జాకెట్‌ను ధరించాలంటూ సూచించింది. షూటింగ్ కారణంగా జాకీ భగ్నానిని మిస్ అవుతున్నట్లు పేర్కొన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అతడి జాకెట్‌ ధరించింది. ఆ జాకెట్‌పై జేబీ అని రాసి ఉంది. జాకీ భగ్నానిని సుదీర్ఘ కాలం పాటు ప్రేమించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గత ఏడాది అతడితో మూడు ముడులు వేయించుకుని, ఏడు అడుగులు నడిచిన విషయం తెల్సిందే.

2021లో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించింది. అంతుకు ముందు నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది అనే వార్తలు వచ్చాయి. ప్రేమ విషయం అధికారికంగా ప్రకటించిన మూడు సంవత్సరాల తర్వాత పెళ్లి పీటలు ఎక్కింది. ఆ మధ్య రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ఖతం అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో ఆఫర్లు లభిస్తున్నాయి. దాంతో ఈ అమ్మడు మరికొన్నాళ్ల పాటు హీరోయిన్‌గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మేరే హస్బెండ్ కీ బివి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్‌కి నిరాశ మిగిలింది.

ప్రస్తుతం చేస్తున్న దే దే ప్యార్‌ దే 2 సినిమాతో అయినార కుల్‌ ప్రీత్‌ సింగ్‌కి హిట్‌ దక్కేనా చూడాలి. బాలీవుడ్‌లో ఒక్క హిట్‌ పడితేనే ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. తద్వారా ఈ అమ్మడికి టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ముందు ముందు ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసింది. కానీ కొన్నాళ్లకే కనిపించకుండా పోయింది. బాలీవుడ్‌లో అయినా ఈ అమ్మడికి లక్‌ కలిసి వస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News