రకుల్ వ్యాపారాలన్నింటికి హైదరాబాద్ హబ్!
అవకాశం వస్తే సౌత్ సినిమాలు చేస్తోంది లేదంటే? ముంబైలోనే ఉంటుంది. కానీ అమ్మడి వ్యాపారాలన్నీ మాత్రం హైదరాబాద్ లోనే.
రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపారాలన్నింటికి హైదరాబాద్ హాబ్ గా మారిందా? అమ్మడి బిజినెస్ కి సంబంధించి మెయిన్ బ్రాంచ్ లన్నీ ఇక్కడే ఉన్నాయా? అంటే అలాగే కనిపిస్తోంది సన్నివేశం. రకుల్ టాలీవుడ్ లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఫాంలో ఉండగానే అమ్మడు బాలీవుడ్ కి వెళ్లింది. ప్రస్తుతం కెరీర్ పరంగా అక్కడే దృష్టి పెట్టి పనిచేస్తోంది. అవకాశం వస్తే సౌత్ సినిమాలు చేస్తోంది లేదంటే? ముంబైలోనే ఉంటుంది. కానీ అమ్మడి వ్యాపారాలన్నీ మాత్రం హైదరాబాద్ లోనే.
ముంబైలో ఉంటూనే హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ సిటీల్లో ఉన్న వ్యాపారాలన్నీంటిని రన్ చేస్తోంది. `ఎఫ్ 45` పేరుతో జిమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం వెల్బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో నూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. హైదరాబాద్ కి చెందిన భాగస్వాములతోనే కలిసి పనిచేస్తుంది. అలాగే 2019 లోనే `న్యూబూ` పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇవి కూడా హైదరాబాద్ హబ్ గానే పంపిణీ జరుగుతున్నాయి. ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభిం చింది. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’ కొలాబరేషన్‌తో కలిసి ప్రారంభించింది. ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు లభిస్తాయి. ఇప్పుడు జనాలంతో ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో మిల్లెట్స్ పుడ్స్ కి ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే.
దీంతో రకుల్ మిల్లెట్స్ తో రకరకరాల వంటకాలు తయారు చేయిస్తుంది. `ఆరంభం`లో ఫుడ్ శరీరానికి మాత్రమే కాదు...ఆత్మ(మనసు)కు కూడా అని అభివర్ణించి ముందుకెళ్తోంది. ఇవన్నీ హైదరాబాద్ హబ్ గానే నడుస్తున్నాయి. బెంగుళూరు, విశాఖ పట్టణం, ఢిల్లీలో లాంటి ప్రదేశాల్లోనూ ఎఫ్ 45 జిమ్ ల్ని ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్ లను మరిన్ని మహానగరాలు విస్తరించే ప్లాన్ లోనూ ఉంది.