3 నెలలు గుండెలు పట్టుకుని.. దండం పెట్టడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి..!
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ లీడ్ రోల్ లో రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ లీడ్ రోల్ లో రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సంబరాల ఏటిగట్టు టైటిల్ తో మాసివ్ యాక్షన్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రాం చరణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో తన స్పీచ్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు రామ్ చరణ్. ముందుగా మైక్ అందుకున్న చరణ్ మేము గుండెల్లో పెట్టుకుని ప్రేమించే అభిమానులకు థాంక్స్ అన్నారు.
ఇక తేజూ 10 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు చరణ్. తేజూ మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి అది మీ అందరికీ తెలిసిందే. మంచి తమ్ముడు, మంచి అన్నయ్య, మంచి కొడుకు. మామయ్యకు మంచి అల్లుడు.. తేజూ చెప్పుకోలేని గుణం ఏమి లేదు. పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్ నుంచి మొదలైన తేజూ జర్నీ కష్టపడుతూ మీ సపోర్ట్ తో ఇక్కడి దాకా వచ్చాడు.
ఇక ఇవాళ తేజు మన దగ్గర ఇలా ఉన్నాడంటే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెబుతున్నా అది కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లే అని అన్నారు చరణ్. ఆరోజు మళ్లీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. ఇది పునర్జన్మ అది ఇచ్చింది మీరే.. మేమందరం ఎంతో భయపడ్డాం.. ఆ టైం లో భావనకు అర్ధం లేదు. గుండె పట్టుకుని 3 నెలలు చాలా కష్టమైన టైం అనుభవించామని.. మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం. దండం పెట్టుకోవడం తప్ప అని ఎమోషనల్ అయ్యారు చరణ్. ఈలోగా జై చరణ్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఫ్యాన్స్ కి లవ్ యు అంటూ నిజంగా మా అభిమానులు బంగారం అన్నాడు.
తేజూ ఆ యాక్సిడెంట్ తర్వాత ఇలా మీ ముందు నిలబడ్డాడు అంటే అది మీ బ్లెస్సింగ్ వల్లే.. అన్నిటికీ మా తరపున ధన్యవాదాలు.. సినిమా గురించి మాట్లాడుతూ తేజూ 18వ మూవీ సంబరాల ఏటిగట్టు. తేజూ ఊచకోత ఎలా ఉంటుందో చూడబోతున్నామని అన్నారు. మొదటి సినిమా అయినా రోహిత్ గారికి, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు చరణ్.
ఇక తేజూ ప్రేమ గురించి చెబుతూ.. తేజూ గాడి ప్రేమ బండ ప్రేమ.. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. ఈ ప్రేమ మగాళ్లకే చూపిస్తున్నాడు.. వాళ్ల అమ్మ రోజు మొత్తుకుంటుంది. వాడికి ఎలా పునర్జన్మ ఇచ్చారో వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే అని అన్నారు చరణ్. చరణ్ రాకతో ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ హుశారుకి నో లిమిట్స్ అన్నట్టుగా మారింది.