మెగా అభిమానుల కోసం మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

మెగాప‌వ‌ర్ స్టార్ -మెగాస్టార్ మ‌ళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారా? # ఆర్సీ 16 ఇద్ద‌ర్నీ మ‌రోసారి ఏకం చేస్తుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

Update: 2025-02-26 10:30 GMT

మెగాప‌వ‌ర్ స్టార్ -మెగాస్టార్ మ‌ళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారా? # ఆర్సీ 16 ఇద్ద‌ర్నీ మ‌రోసారి ఏకం చేస్తుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క త్వంలో ఆర్సీ 16 షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు...మూడు షెడ్సూల్స్ కూడా పూర్త‌య్యాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఓస్పెష‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి.

బుచ్చిబాబు చిరంజీవి కోసం ఓ స్పెష‌ల్ రోల్ డిజైన్ చేసార‌ని వినిపిస్తుంది. మ‌రి చిరంజీవి నిజంగా న‌టిస్తున్నారా? లేదా? అన్న‌ది మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది. చ‌ర‌ణ్ -చిరంజీవి ఇప్ప‌టికే `మ‌గ‌ధీర‌`లో `బంగారు కోడి పెట్ట` సాంగ్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అటుపై `ఆచార్య‌`లో ఇద్ద‌రు క‌లిసి న‌టించారు. అందులో చిరంజీవి హీరో అయినా? రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ల‌మైన పాత్ర పోషించారు.

కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో ఆ ద్వ‌యం హైలైట్ అవ్వ‌లేదు. తాజాగా చిరంజీవి-చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారనే ప్ర‌చారం మెగా అభిమానుల్లో జోష్ నింపుతుంది. `ఆచార్య` త‌ర్వాత డాడ్ అండ్ స‌న్ మ‌ళ్లీ ఎప్పుడు క‌లిసి న‌టిస్తారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్ర‌చారం నిజ‌మైతే అభిమానుల దాహం తీరుతుంది.

రామ్ చ‌ర‌ణ్ గ‌త సినిమా `గేమ్ ఛేంజ‌ర్` కూడా అభిమానుల్ని నిరుత్సాహ ప‌రిచింది. భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన ఫ‌లితం చూసి చ‌ర‌ణ్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో చ‌ర‌ణ్ కి సోలో పాన్ ఇండియా స‌క్సెస్ అంతే అవ‌స‌ర‌మైంది. చిరంజీవి ఎంట్రీ నిజ‌మైతే? ఈసినిమా సక్సెస్ అయితే చిరుకు కూడా పాన్ ఇండియాలో క‌లిసొస్తుంది. `సైరా న‌ర‌సింహారెడ్డి`తో చిరంజీవి కూడా పాన్ అటెంప్ట్ చేసారు కానీ ఫ‌లితం ఆశించిన విధంగా రాని సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News