పిక్‌ టాక్ : మెగా ప్రిన్స్ క్లింకార సంక్రాంతి స్పెషల్‌

ఇప్పటి వరకు క్లింకార యొక్క ఫేస్‌ని రివీల్‌ చేయలేదు. ఈసారి కూడా క్లింకార యొక్క ఫేస్‌ని రివీల్‌ చేయకుండానే ఫోటోను షేర్‌ చేశారు.

Update: 2025-01-14 21:30 GMT
పిక్‌ టాక్ : మెగా ప్రిన్స్ క్లింకార సంక్రాంతి స్పెషల్‌
  • whatsapp icon

రామ్‌ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా రామ్‌ చరణ్ ఫ్యామిలీకి సాధ్యం అయినంత వరకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. భార్య ఉపాసనతో పాటు కూతురు క్లింకార గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండే రామ్‌ చరణ్ ఈ సంక్రాంతిని వారిద్దరితో సంతోషంగా గడుపుకున్నారు. కూతురు క్లీంకార కి భోగిపళ్లు పోశారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఇప్పటి వరకు క్లింకార యొక్క ఫేస్‌ని రివీల్‌ చేయలేదు. ఈసారి కూడా క్లింకార యొక్క ఫేస్‌ని రివీల్‌ చేయకుండానే ఫోటోను షేర్‌ చేశారు.

తన అభిమానులతో పాటు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాసన, రామ్‌ చరణ్‌లు తమ కూతురుతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోకు చాలా మంది క్లీంకార ను ఇంకా ఎప్పుడు చూస్తామో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు సోషల్‌ మీడియాలో క్లింకార క్యూట్‌ ఫోలోలు కొన్ని వచ్చాయి. కానీ ఇప్పటి వరకు వీరిద్దరు కానీ, మెగా ఫ్యామిలీ మెంబర్‌ కానీ ఎవరూ క్లింకార యొక్క ఫోటోను షేర్‌ చేయలేదు. క్లింకార అఫిషియల్‌ ఫోటోలు అధికారికంగా బయటకు రాలేదు. ఈ సంక్రాంతికి కూడా క్లింకార ఫోటోలను రివీల్‌ చేయకుండానే ఆమెను చూపించారు అంటూ ఫ్యాన్స్ ఒకింత నిరుత్సాహం ను వ్యక్తం చేస్తున్నారు.

క్లింకార పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ప్రతి సందర్భంను పండుగ మాదిరిగా జరుపుకుంటూనే ఉన్నారు. అత్యధికంగా క్లింకార గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల టీవీలో నాన్నను చూసి నాన్న అంటూ అరిచిన క్లీంకార వీడియోను ఉపాసన షేర్‌ చేశారు. అంతకు ముందు మరో వీడియో, ఫోటో ఇలా క్లీంకార గురించిన విషయాలను ఎప్పటికప్పుడు ఉపాసన లేదా చరణ్‌ షేర్‌ చేస్తూనే ఉన్నారు. అందుకే క్లింకార ఫేస్ కూడా కనిపించకుండానే స్టార్‌ అయ్యింది. పాప అప్పుడే నడిచేంత ఎదిగింది. ముందు ముందు మరింత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందేమో చూడాలి.

ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ నిర్మాణ సంస్థ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. అయితే లాంగ్‌ రన్‌లో ఎంత మేరకు వసూళ్లు సాధిస్తుంది, ఏ మేరకు సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుంది అనేది చూడాలి. ఇక గేమ్‌ ఛేంజర్ విడుదలకు ముందే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. త్వరలోనే మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. గేమ్‌ ఛేంజర్‌ ఫలితం నేపథ్యంలో ఇదే ఏడాదిలో బుచ్చిబాబు సినిమా వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి బుచ్చిబాబు సినిమాను ఎప్పుడు తీసుకు వస్తాడో చూడాలి.

Tags:    

Similar News