అతి పెద్ద రామ్‌ చరణ్‌ కటౌట్‌ ఇదుగో..!

సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చరణ్ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో రికార్డ్‌ స్థాయి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

Update: 2024-12-29 06:40 GMT

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'గేమ ఛేంజర్‌' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు గేమ్‌ ఛేంజర్‌ సినిమాను రూపొందించారు. సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం కోసం దిల్‌ రాజు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెల్సిందే. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చరణ్ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో రికార్డ్‌ స్థాయి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

 

విజయవాడలోని బృందావన కాలనీ వజ్రా మైదానంలో ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ హీరో పెట్టని 256 అడుగుల భారీ కటౌట్‌ను చరణ్ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. యువశక్తి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. రామ్‌ చరణ్‌ పై తమకు ఉన్న అభిమానంను వారు ఇలా చూపించారు. సోషల్‌ మీడియాలో వారు ఏర్పాటు చేసిన అతి భారీ కటౌట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్‌ ఆవిష్కరణ జరిగింది. దాదాపు వారం రోజుల పాటు కష్టపడి ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లుగా ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక టీం ఈ భారీ కటౌట్‌ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అత్యంత ఖరీదుతో ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లుగా ఫ్యాన్స్‌ చెప్పుకొచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు. లుంగీ కట్టుకుని, బనియన్‌ పై ఉన్న రామ్‌ చరణ్ మాస్‌ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయవాడ రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ పై మెగా ఫ్యాన్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఈ అరుదైన ఘనతకు పూర్తిగా అర్హుడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆయన నుంచి మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ జంటగా రూపొందిన ఈ సినిమాలో తమిళ దర్శకుడు ఎస్‌ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది. సూర్య పాత్రను రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాల్లో ఈ సినిమా హైలైట్‌గా నిలవబోతుంది. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి రామ్‌ చరణ్‌ ఏకంగా 200 రోజుల పాటు చరణ్ ఈ సినిమాలో నటించారు. మొదటి సారి రామ్‌ చరణ్‌ తండ్రి, కొడుకు పాత్రల్లో డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటించగా, శ్రీకాంత్‌ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News