గేమ్ ఛేంజర్ ట్రైలర్: పాలిటిక్స్ లో రామ్ పవర్ఫుల్ గేమ్
తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉన్నారు.
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉన్నారు.
ఇక సినిమా ట్రైలర్ తోనే అసలు బజ్ క్రియేట్ అవుతుంది అని ఎదురు చూస్తుండగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. దర్శకుడు శంకర్ ఇప్పటికే టీజర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కొంత క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ తో ఆంచనాల స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ అయింది.
డైరెక్టర్ శంకర్ మార్క్ కు తగ్గట్టుగా ఓ మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ తో సాయిమాధవ్ బుర్ర పెన్ పవర్ చూపించారు. 'కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలిపెడితే, పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం. నేను కూడా మీ దగ్గర అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే..' అంటూ రామ్ నందన్ కలెక్టర్ పాత్రలో చెప్పిన డైలాగ్ ఆలోచింప జేసే విధంగా ఉంది.
అలాగే అప్పన్న క్యారెక్టర్ ను కూడా హైలెట్ చేశారు. 'మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు' అనే డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్ అలాగే కలర్ఫుల్ సాంగ్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఒక నిజాయితీ కలిగిన కలెక్టర్ కు అలాగే పవర్ఫుల్ పొలిటీషియన్ కు జరిగే క్లాష్ తరహాలో సినిమా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఇక అప్పన్న ఫ్యాష్ బ్యాక్ ఎమోషనల్ గా కూడా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. SJ సూర్య క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా హైలెట్ చేశారు. ఇక సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరింత బూస్ట్ ఇచ్చేలా ఉందని అనిపిస్తోంది. ఫైనల్ గా ట్రైలర్ తో మంచి కిక్ అయితే ఇచ్చారు. సినిమాను చూడాలి అనే ఆసక్తిని బలంగా పెంచారు. మరి బిగ్ స్క్రీన్ పై గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.