మెగా పవర్ స్టార్ కోసం ముగ్గురు క్యూలో!
చరణ్ ఐదేళ్ల తర్వాత డేట్లు ఇచ్చినా? పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం అని కాచుకుని కుర్చున్నారు కొందరు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీ హీరో అన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇది పూర్తయిన వెంటనే సుకుమార్ తో 17వ సినిమా మొదలు పెడతాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ అవ్వడనికి ఎలా లేదన్నా? మూడేళ్లకు పైగా సమయం పడుతుంది. అయినా చరణ్ కోసం క్యూలో ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు. చరణ్ ఐదేళ్ల తర్వాత డేట్లు ఇచ్చినా? పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం అని కాచుకుని కుర్చున్నారు కొందరు.
అందులో ఈ ముగ్గురు దర్శకులు కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ మేకర్ నికిల్ నగేష్ చరణ్ ఇమేజ్ కి తగ్గ ఓ డిఫరెంట్ స్టోరీ సిద్దం చేసి పెట్టాడట. అది పౌరాణిక నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. చరణ్ కి వినిపించాడా? లేదా? అన్నది క్లారిటీ లేదు గానీ..వింటే మాత్రం నో చెప్పకుండా ఒప్పుకుంటాడు అనే కాన్పిడెన్స్ తో నిఖిల్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే తెలుగు నుంచి `హాయ్ నాన్న` ఫేం శౌర్యువ్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నాడు.
`హాయ్ నాన్న`తో శౌర్యువ్ కి దర్శకుడిగా మంచి పేరొచ్చింది. ఆ సినిమా కమర్శియల్ గా సక్సస్ అవ్వలేదు గానీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఈ నేపథ్యంలో శౌర్యువ్ కూడా చరణ్ కోసం ఓ స్టోరీ సిద్దం చేసి పెట్టాడట. చరణ్ పాన్ ఇండిమా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సిద్దం చేసిన స్టోరీ అని సన్నిహితుల నుంచి తెలిసింది. అలాగే మరోవైపు ఓ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కూడా చరణ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడుట. తమిళ్ లో అతడు పేరున్న డైరెక్టర్ అని గతంలో చరణ్ కూడా తనతో సినిమా చేయమని రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు చరణ్ కోసం తాను కూడా ఓ స్టోరీ సిద్దం చేసి పెట్టాడట. మరి చరణ్ వీళ్ల ముగ్గురిలో ముందుగా ఎవరితో ముందుకెళ్తాడు? అన్నది తర్వాత సంగతి.