మెగా పవర్ స్టార్ లైనప్ ఇలా ప్లాన్ చేసాడా!
సినిమా రిలీజ్ ల విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది.;

సినిమా రిలీజ్ ల విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఒకేసారి రెండు..మూడు సినిమాలు అనౌన్స్ చేయడం...వాటిలో మొదటి చిత్రాన్ని పట్టాలెక్కించి తదుపరి ప్రాజెక్ట్ ల విషయంలోనూ బ్యాకెండ్ వర్క్ చేయడం అన్నది చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత అలవాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 16 ` పెద్ది` బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమై నెలలు గడుస్తుంది. ఇటీవలే రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటుపై సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 17వ సినిమా పట్టాలెక్కుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ గురించి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు కూడా ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ తదుపరి చిత్రాల లైనప్ కూడా లీక్ అయింది. చరణ్ 18వ చిత్రం ప్రశాంత్ నీల్ తో ఉంటుందని అంచనా. అటుపై 19వ చిత్రం పాన్ ఇండియా సంచలన సందీప్ రెడ్డి వంగాతో ఉం టుందని వినిపిస్తుంది. అలాగే 20వ చిత్రం కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ తో సెట్ అయినట్లు వార్త లొస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకులంతా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
చరణ్ కాల్షీట్లు.. దర్శకుల బిజీ షెడ్యూల్ ను బట్టి ఎప్పుడు ఏ సినిమా పట్టాలెక్కుతుంది? అన్నది క్లారిటీ వస్తుంది. అయితే ఈసినిమాలన్నీ చరణ్ పూర్తి చేయాలంటే ఏలా లేదన్నా ఆరేడేళ్లకు పైగానే సమయం పడుతుంది. అంతకు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే? డార్లింగ్ ప్రభాస్ లా ఏక కాలంలో రెండు సినిమాల షూటింగ్ లకు హాజరైతే సాధ్యమే. నాలుగేళ్లలోనే ఈ కమిట్ మెంట్లు అన్ని పూర్తి చేయోచ్చు.