ఈసారి గ్లోబ‌ల్ స్టార్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కానా?

ఈ నేప‌థ్యంలో త‌న క్రేజ్‌కు త‌గ్గ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.;

Update: 2025-04-07 04:28 GMT
ఈసారి గ్లోబ‌ల్ స్టార్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కానా?

RRR తో రామ్ చ‌ర‌ణ్‌కు గ్లోబ‌ర్‌గా మంచి గుర్తింపు ల‌భించ‌డం తెలిసిందే. ఈ మూవీలోని 'నాటు నాటు' పాట‌కు ఆస్కార్ అవార్డ్ ద‌క్క‌డంతో చ‌ర‌ణ్‌పై హాలీవుడ్ స్టార్స్‌, స్టార్ డైరెక్ట‌ర్స్ దృష్టిప‌డింది. ఈ నేప‌థ్యంలో త‌న క్రేజ్‌కు త‌గ్గ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. శంక‌ర్‌తో చేసిన 'గేమ్ ఛేంజ‌ర్‌' నిరాశ పరచడం తో ఈ సారి గ్లోబ‌ల్ రేంజ్‌లో రీసౌండ్ ఇచ్చే బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో చ‌ర‌ణ్ 'ఉప్పెన‌' ఫేమ్ బుచ్చిబాబు సాన‌తో క‌లిసి భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్టాడు.

'పెద్ది' టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో మెగా అభిమానుల్ని మెస్మ‌రైజ్ చేసే క‌థ‌, క‌థ‌నాల‌తో, అంత‌కు మించి అద్భుత‌మైన క్యారెక్ట‌రైజేష‌న్‌తో ఈ మూవీ తెర‌పైకొస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన `పెద్ది` ఫ‌స్ట్ షాట్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసిది. శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా మేక‌ర్స్ మేక‌ర్స్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ షాట్ వీడియో అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల్ని మెస్మ‌రైజ్ చేసింది.




 


`రంగ‌స్థ‌లం`లోని చిట్టిబాబు క్యారెక్ట‌ర్‌ని మించి స‌రికొత్త మేకోవ‌ర్‌తో చ‌ర‌ణ్ క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. చెవుల‌కు, ముక్కుకు పోగులు ధ‌రించి చార‌ల చొక్కాలో బీడీ కాలుస్తూ చ‌రణ్ లుక్ ఊర‌మాస్‌గా ఉంది. ఉత్త‌రాంధ్ర యాస‌లో సాగే చ‌రణ్ క్యారెక్ట‌ర్ ఈసారి మెగా ఫ్యాన్స్ ఐఫీస్ట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. `ఒక‌టే ప‌ని చేసేనాకి ఓకేనా...ఇంత‌పెద్ద బ‌తుకు..ఏదైనా ఈ నేల మీద ఉన్న‌ప్పుడే సేసెయ్యాలా...` అంటూ చ‌ర‌ణ్ చెప్పే ఉత్త‌రాంధ్ర యాస డైలాగ్‌లు వైర‌ల్‌గా మారాయి.

ఊర మాస్‌క్యారెక్ట‌ర్‌లో క్రికెట్ మైదానంలో బ్యిటింగ్ చేస్తూ త‌న‌దైన మార్కు షాట్‌తో బాల్ ని బౌండ‌రీ దాటించిన తీరు ఈ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇందులో చ‌ర‌ణ్ పెద్దిగా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న న‌ట‌న‌కు ఈసారి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ప‌క్కా అని అభిమానులు చెబుతున్నారు. గ్లోబ‌ల్ స్టార్‌కు, మెగా అభిమానుల‌కు తీవ్ర నిరాశ‌ను క‌లిగించిన సంవ‌త్స‌రం 2018. కార‌ణం ఇదే ఏడాది రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా ఆర్టిస్ట్‌గా చ‌ర‌ణ్‌కు స‌రికొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది.

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో ర‌చ‌ణ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఈ సినిమాకు సంబంధించి ప్రాంతీయ చిత్రం విభాగంలో చ‌ర‌ణ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ గ్యారంటీ అని అంతా భావించారు. కానీ `మ‌హాన‌టి`తో కీర్తిసురేష్ పోటీప‌డ‌టంతో ఆ అవ‌కాశం ఒక్కడుగు దూరంలో మిస్స‌యింది. ఇప్పుడు అది చ‌ర‌ణ్‌ని వ‌రించే స‌మ‌యం వ‌చ్చింద‌ని మెగా అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. బుచ్చిబాబు సాన `పెద్ది`తో ఆ క‌ల నెల‌ర‌వేరుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

Tags:    

Similar News