బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు.;
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ లుక్ ఇప్పటి వరకు రివీల్ కాలేదు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా తన గత చిత్రం మాదిరిగా ఈ సినిమా ఎలా ఉంటుందనే ముందస్తు ఆలోచన, అనుమానం అక్కర్లేదని, ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంను బుచ్చిబాబు ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
గురువు సుకుమార్‌కి ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు సినిమాలు ఉంటాయి. రామ్ చరణ్‌తో రూపొందిస్తున్న సినిమాతో గురువును మించిన శిష్యుడు అని బుచ్చిబాబు అనిపించుకుంటారు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద చరణ్‌కి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను బుచ్చిబాబు ఇవ్వబోతున్నాడు అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి ఆయన రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం అందుతోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెలలో రామ్ చరణ్ బర్త్‌డే ఉన్న విషయం తెల్సిందే. చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న సినిమా టీజర్‌ను లేదా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని బుచ్చిబాబుకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. బుచ్చిబాబు సైతం అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం అందుతోంది. సినిమా టైటిల్‌ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే మెగా కాంపౌండ్ నుంచి ఆ టైటిల్‌కి గ్రీన్ సిగ్నల్ వస్తే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్‌ను విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే చర్చ జరుగుతుందట. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ను మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇంతకు రామ్ చరణ్ బర్త్‌డే కి బుచ్చిబాబు నుంచి వచ్చే గిఫ్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బుచ్చిబాబు ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ సైతం చాలా ఆతృతతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై చరణ్ బర్త్ డే గ్లిమ్స్‌తో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.