ఏఐ వీడియో : చరణ్ ఇలా పెద్ది డైలాగ్ చెప్తే..!
పెద్ది ఫీవర్ ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో పీక్స్‌లో ఉంది. ఆ ఫీవర్ నేపథ్యంలో వచ్చిన ఈ ఏఐ వీడియో అంతకు మించి అన్నట్లుగా ఉంది.;

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించేది, కనిపించేది ఏఐ టెక్నాలజీ అనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ మొత్తం ప్రపంచాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉన్న వారిని లేనట్లుగా, లేని వారిని ఉన్నట్టు, చేయని పనిని చేసినట్లు, చేసిన పనిని చేయనట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ చేయలేని పని ఏమీ ఉండదేమో అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం ఏఐ అనేది ప్రారంభ దశలోనే ఉంది. అయినా కూడా సోషల్ మీడియాను వినియోగించి చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ లేవు. ఏఐను వినియోగించి ఏకంగా సినిమాలనే రూపొందించవచ్చు అంటున్నారు. ఆ రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి.
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' నుంచి శ్రీరామ నవమి సందర్భంగా వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ లుక్‌తో పాటు డైలాగ్, క్రికెట్ ఆడుతున్న విధానం, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చరణ్ చెప్పిన ఒటే పని సేసేనాకి ఒకే నాగ బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నెల మీద ఉన్నప్పుడే సేసేయ్యాల పుడతామా ఏటి మళ్లీ.. డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఆ డైలాగ్ ను తీసుకుని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్న వీడియోతో మార్ఫింగ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో అని చెప్పినా నిజమా అని ఆశ్చర్య పోయేంత నేచురల్‌గా దాన్ని క్రియేట్ చేశారు.
పెద్ది ఫీవర్ ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో పీక్స్‌లో ఉంది. ఆ ఫీవర్ నేపథ్యంలో వచ్చిన ఈ ఏఐ వీడియో అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓ రేంజ్‌లో చరణ్ పెద్ద డైలాగ్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీతో చేసిన వీడియో సైతం వైరల్ అవుతోంది. తక్కువ సమయంలోనే ఏకంగా లక్ష వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ ఎత్తున షేర్స్‌ను దక్కించుకుంది. మొత్తానికి రామ్ చరణ్ పెద్ద సినిమా గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తోంది. ముందు ముందు కూడా పెద్ద సినిమా విశేషాలు ఏ స్థాయిలో వైరల్ అవుతాయో చూడాలి. రామ్ చరణ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా రంగస్థలం తరహా సినిమా రా కంటెంట్‌తో ఈ సినిమాలో చరణ్ కనిపించబోతున్నారు. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు గురువుకి తగ్గ శిష్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన నటన ప్రతిభ ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాలో ఆట కూలీ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఒకటే పని చేసేకి ఇంత పెద్ద బతుకు ఎందుకు అనే డైలాగ్‌లో ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన ఆటలు ఆడుతాడని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.