చరణ్ 'పెద్ది'.. ఈ సారి చాలా తొందరగానే..

ఆ తర్వాత ఇటీవల గ్లింప్స్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి కానుకగా మేకర్స్ సందడి చేయనున్నారు.;

Update: 2025-03-31 10:27 GMT
చరణ్ పెద్ది.. ఈ సారి చాలా తొందరగానే..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో వచ్చిన చరణ్.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. దీంతో ఇప్పుడు పెద్ది మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.

రీసెంట్ గా చరణ్ బర్త్ డే మేకర్స్ ఇచ్చిన అప్డేట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. చరణ్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మూవీపై హైప్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇటీవల గ్లింప్స్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి కానుకగా మేకర్స్ సందడి చేయనున్నారు.

ఉగాది స్పెషల్ గా ఆ చిన్న అప్డేట్ ఇచ్చి అందరినీ ఖుషీ చేశారు మేకర్స్. ఆ సమయంలో రామ్ చరణ్ గాల్లోకి ఎగిరి ఏదో ఆటకు బరిలో దిగుతున్నట్లు ఉన్న పోస్టర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. పెద్ది మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అలా షూటింగ్ స్టార్ట్ అయిన 135 రోజులకే సినిమా గ్లింప్స్ రానుంది. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు చరణ్ గత సినిమాల కోసం డిస్కస్ చేసుకుంటున్నారు.

చరణ్ రీసెంట్ గా చేసిన గేమ్ ఛేంజర్ మూవీ గ్లింప్స్.. షూటింగ్ మొదలైన 1114 రోజుల తర్వాత రిలీజ్ అయింది. అంతకుముందు ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గ్లింప్స్.. చిత్రీకరణ స్టార్ట్ అయిన 494 రోజుల తర్వాత విడుదలైంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ మాత్రం.. చాలా త్వరగా వస్తుందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

దాని బట్టి చూస్తే పెద్దిపై అటు చరణ్.. ఇటు మేకర్స్ ఎంతలా ఫోకస్ పెట్టారో క్లియర్ గా తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. రామ్‍ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News