చరణ్ 'పెద్ది'.. ఆ సీక్వెన్స్ మూవీకే హైలైట్!

ప్రస్తుతం రైల్వే స్టేషన్ సెట్‌ లో రామ్ చరణ్ పై కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.;

Update: 2025-04-15 00:30 GMT
చరణ్ పెద్ది.. ఆ సీక్వెన్స్ మూవీకే హైలైట్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా.. క్రీడా నేపథ్యంలో సందడి చేయనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి.

పెద్ది రోల్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని చేసిన సందడి, ఆయన కొట్టిన క్రేజీ షాట్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్.. గ్లింప్స్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి. అదే సమయంలో మూవీపై ఆడియన్స్ లో వేరే లెవెల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో నో డౌట్.

అయితే వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు కల్లా చరణ్ కు సంబంధించిన సీన్స్ ను కంప్లీట్ చేస్తారని సమాచారం. దీంతో బుచ్చిబాబు స్పీడ్ కు అంతా షాకవుతున్నారట.

మొత్తానికి పెద్ది షూటింగ్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ సెట్‌ లో రామ్ చరణ్ పై కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు ఆ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సినిమా స్టోరీని మలుపు తిప్పేస్తుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ అండ్ రైల్వే స్టేషన్ సీక్వెన్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నామని.. ఇప్పుడు మరిన్ని హోప్స్ పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.

Tags:    

Similar News