RC16: చరణ్ మాస్ ఫైర్.. గెట్ రెడి!
‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన బుచిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ కెరీర్‌లో మరో పాన్ ఇండియా మూవీగా నిలవనుంది.;

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా RC16 షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రొజులైనా ఇంకా సరైన అప్డేట్ ఏది ఇవ్వలేదు. ముఖ్యంగా టైటిల్ పెద్ది అని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ మేకర్స్ దానిపై సరైన క్లారిటీ రాలేదు. ఒక్క అప్డేట్ రాకున్నా కూడా సినిమా పై అంచనాలు రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నాయి. ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన బుచిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ కెరీర్‌లో మరో పాన్ ఇండియా మూవీగా నిలవనుంది.

అయితే ఎట్టకేలకు మేకర్స్ ఓ మంచి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొనగా, చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ నుండి వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ మాస్ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో వచ్చిన పోస్టర్లలో భిన్నంగా, ఊహించని విధంగా రూపొందిన ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో చరణ్ సిగార్ పట్టుకుని తిరుగుతుండటం, వెనకాల నుంచే కెమెరా యాంగిల్ ద్వారా చూపించడం, ఫ్యాన్స్‌ను కొత్త మూడ్‌లోకి తీసుకెళ్లింది.
గడ్డంతో, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో, చేతిలో సిగార్ ఉండటంతో రామ్ చరణ్ పాత్రలో మాస్ పవర్ దాగి ఉందని అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమా క్యారెక్టర్ గురించి ఊహించుకోవడం కష్టమైపోయింది, కానీ ఆసక్తి మాత్రం రెట్టింపు అయింది. ఈ సినిమా కథ పరంగా స్పోర్ట్స్ డ్రామాగా వచ్చినా, దానికి మాస్ మసాలా టచ్, ఎమోషనల్ డెప్త్ కూడా ఉండనుందని టాక్. ఇప్పటికే చరణ్ నటన పరంగా ఎమోషనల్ సీన్స్‌లో తనను నిరూపించుకున్నారు.
ఇప్పుడు ఈ పాత్రతో ఆయన ఏ స్థాయిలో తనని మళ్లీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ లుక్ చరణ్ ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటి కంటే భిన్నంగా ఉండబోతోందనే సంకేతాలు అందిస్తున్నది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. అతని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో ఎంతో కీలకమైన పాత్ర ఉంటుంది.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కట్టుబడినట్టు స్పష్టమవుతోంది. ప్రతీ ఫ్రేమ్‌లో విజువల్ గ్రాండియర్‌కి కొదవ ఉండదని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు, నేపథ్యం, నేపధ్యం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. ఇక మార్చి 27 ఉదయం 9:09కు ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మొత్తానికి ‘RC16’ ఓ స్పోర్ట్స్ డ్రామాగా కనిపించినా, ఇందులో మాస్, రఫ్, రా క్యారెక్టరైజేషన్‌తో చరణ్ అభిమానుల మనసు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బుచ్చిబాబు కథ చెప్పిన విధానం, చరణ్ లుక్ ఇచ్చే మ్యాజిక్ తో ఇది పాన్ ఇండియా రేంజ్ లో మరో సంచలనం సృష్టించవచ్చనే అంచనాలు ఊపందుకున్నాయి.