సందీప్-చరణ్.. ఇదే బాండింగ్ సినిమా వరకు వెళితే..

సోషల్ మీడియాలో వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-03-27 11:07 GMT
Sandeep Ramcharan combo coming soon

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు వారి స్టైల్ లో విషెస్ అందిస్తున్నారు. ఇక పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా కావాల్సిన రెస్పాన్స్ ను అందుకుంటోంది. చాలామంది సెలబ్రెటీలు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ సినీ వర్గాల్లో మాత్రం మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. అది సందీప్ రెడ్డి వంగా - రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం. సోషల్ మీడియాలో వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల సందీప్ రెడ్డి వంగా వరుసగా డిఫరెంట్ జానర్లతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాల ద్వారా ఆయనకు మాస్ ఆడియన్స్‌ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వంగా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తరువాత ఎవరితో పని చేస్తాడనే విషయమై చాలా కాలంగా ఊహాగానాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సందీప్ ట్వీట్ చేశారు.అమేజింగ్ వండర్ఫుల్ ఫ్రెండ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ చరణ్‌ను చాలా ప్రత్యేకంగా అభివర్ణించారు. ఇది ఒక్క విషింగ్ మేసేజ్ మాత్రమే కాదు, వాళ్లిద్దరూ ఎప్పటికైనా కలసి పని చేయబోతున్నారనే సంకేతంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ముఖ్యంగా ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వంగా షేర్ చేస్తూ పవర్ఫుల్ లుక్ అంటూ ప్రశంసించడమూ గమనార్హం.

ఒక విధంగా ఇది చరణ్ లుక్‌పై ఆయనకు ఉన్న అభిమానం, ఆశ్చర్యం, అభిమానంతో పాటు, ప్రాజెక్ట్‌పై ఆసక్తికర సంకేతాలు ఇస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే వంగా – చరణ్ కాంబినేషన్‌లో ఓ స్క్రిప్ట్ దశలో ఉంది. ఇది పూర్తిగా ఒక డార్క్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని వినిపిస్తోంది. ఒకవేళ ఇది ఫైనల్ అయితే, ఇది చరణ్‌కు ఇప్పటివరకు కనిపించని యాంగిల్‌ను తెరపై చూపించేందుకు వంగా ప్రయత్నించబోతున్నాడన్న మాట.

ప్రస్తుతం చరణ్ 'పెద్ది' మూవీతో బిజీగా ఉండగా, వంగా ప్రభాస్‌తో స్పిరిట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావచ్చని ట్రేడ్ టాక్. ఒకవేళ ఇది నిజమైతే, రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ మూవీగా నిలవనుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘యానిమల్’ తరహాలో ఒక బోల్డ్ క్యారెక్టరైజేషన్‌లో చరణ్ కనిపిస్తే అది ఫ్యాన్స్‌కు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుంది.

Tags:    

Similar News