RC17లో సమంత.. ఛాన్స్ ఉందంటారా..?

ఆల్రెడీ రంగస్థలం తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరో సినిమాకు రెడీ అవుతుంది.;

Update: 2025-03-03 17:27 GMT

గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పిరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని లాక్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు. ఆల్రెడీ రంగస్థలం తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరో సినిమాకు రెడీ అవుతుంది.

రామ్ చరణ్ తో సుకుమార్ చేసే సినిమా కథ కూడా గ్లోబల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోతున్న సినిమా కాబట్టి మామూలుగానే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉంటాయి. ఐతే వాటికి ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ కథ రాసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే ఆర్సీ 17 సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.

ముఖ్యంగా హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న డిస్కషన్ మొదలైంది. పుష్ప లో చేసిన రష్మిక మందన్నానే ఫస్ట్ ఛాయిస్ అని తెలుస్తుంది. ఎలాగు సుకుమార్ తో మంచి ర్యాపో ఉంది కాబట్టి రష్మిక ఈ సినిమా చేసే అవకాశం లేకపోలేదు. ఐతే అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మరోపక్క రష్మిక కాకపోతే సమంత ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.

సమంత ఆల్రెడీ రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర చేసింది. అందుకే రాం చరణ్ సినిమాకు హిట్ కాంబోని రిపీట్ చేయాలని చూస్తున్నారట. ఐతే సమంత ఈమధ్య తెలుగు సినిమాలు చేయట్లేదు. అమ్మడు పూర్తిగా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంది. ఐతే సమంత కి ఛాన్స్ ఇచ్చినా చేస్తుందా అన్న గ్యారెంటీ అయితే లేదు.

ఐతే ఆర్సీ 17 సినిమాలో సమంత నటిస్తే మాత్రం ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. సమంత తప్పకుండా ఈ ఛాన్స్ అందుకుంటే మరో గొప్ప అవకాశం చేజిక్కించుకున్నట్టే అవుతుంది. మరి సమంత సుకుమార్ రామ్ చరణ్ కాంబో ఫిక్స్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. తెలుగులో ఆమె నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా ఒకటి అనౌన్స్ చేసింది కానీ ఆ సినిమా ఏమయ్యిందో ఇప్పటివరకు తెలియలేదు. ఐతే టాలీవుడ్ లో సినిమా చేస్తే తన రేంజ్ కి తగిన సినిమా చేయాలని అనుకుంటుంది సమంత.

Tags:    

Similar News