27 ఏళ్లలో 26 ఫ్లాపులు.. అయినా స్టార్ డైరెక్టరే
అయినా ఇప్పటికీ ఆర్జీవీ స్టార్ డైరెక్టర్ గా తన హోదాను కొనసాగిస్తున్నాడు.;

అతడు 27 సంవత్సరాలలో 26 ఫ్లాప్ సినిమాలు తీసాడు. గుర్తుంచుకోదగ్గ హిట్లు నాలుగైదు మాత్రమే. షో బిజ్‌లో అతి పెద్ద ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 35 సంవత్సరాల కెరీర్‌లో 36 కి పైగా బాలీవుడ్ సినిమాలు, డజన్ల కొద్దీ తెలుగు, తమిళ సినిమాలను అతడు తెరకెక్కించాడు. అయితే అతడి సక్సెస్ శాతం జీరోకి పడిపోయినా ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గానే గౌరవం అందుకుంటున్నాడు. అతడు మరెవరో కాదు.. ది గ్రేట్ ఆర్జీవీ. రామూజీ అని కూడా పిలుస్తారు. కెరీర్ లో ఆర్జీవీ తెరకెక్కించిన వాటిలో కేవలం కొన్నిమాత్రమే మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. రామ్ గోపాల్ వర్మ కెరీర్‌ను పరిశీలిస్తే... అతడి చివరి మూడు సినిమాలు కోటి రూపాయల మార్జిన్‌ను కూడా తాకలేకపోయాయి. అతడు ఐదారు మంచి సినిమాలను మాత్రమే తీసాడు. యావరేజ్‌లు వదిలేస్తే చాలా సినిమాలకు లాభాలే రాలేదు.
అయినా ఇప్పటికీ ఆర్జీవీ స్టార్ డైరెక్టర్ గా తన హోదాను కొనసాగిస్తున్నాడు. అతడి కంటూ ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. 90ల కాలంలో ఆర్జీవీ ఏలారు. అతడు తెరకెక్కించిన మూడు చిత్రాలు శివ, రంగీలా, సత్య అతడు ఏమిటో డిఫైన్ చేసాయి. దశాబ్ధం పాటు ఎదురే లేకుండా సినిమాలు తీసాడు. ఆడినా ఆడకపోయినా ఆయనను గాడ్ లాగా చూసారు.
అయితే 2000ల ప్రారంభంలో రామ్ గోపాల్ వర్మ క్రేజ్ క్షీణించడం ప్రారంభమైంది. అతడి సినిమాలు ఏవీ లాభాలను ఆర్జించలేదు. కంపెనీ, జంగిల్ , సర్కార్ వంటి చిత్రాలు తృటిలో పరాజయాల నుండి తప్పించుకున్నాయి. 2017 నుండి ఆర్జీవీ ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. 2018 లో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఐస్ క్రీమ్ సిరీస్ సహా పలు డీగ్రేడ్ చిత్రాలతో తన ఇమేజ్ ని తానే కిందికి దిగజార్చుకున్నాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. గత ఎన్నికల్లో వైయస్ జగన్ తరపున అతడు చేసిన దానికి ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నాడో చూస్తున్నదే.