పుష్పరాజ్ క్యారెక్టర్ వారికొక ఉదాహరణ: RGV

ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ప్రత్యేకమైన అభిప్రాయాలతో మరోసారి ట్విట్టర్‌లో సంచలనం సృష్టించారు.

Update: 2024-12-09 09:41 GMT

పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఊహించని రేంజ్ లో సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం పాజిటివ్ కామెంట్స్ తో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ప్రత్యేకమైన అభిప్రాయాలతో మరోసారి ట్విట్టర్‌లో సంచలనం సృష్టించారు. ఈసారి ఆయన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను ఒక డిఫరెంట్ పోలీలతో హైలెట్ చేశారు.

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోని ఉదాహరణగా తీసుకుంటూ, బాలీవుడ్ తారలు తమ పాత్రలను సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారని వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మ మాట్లాడుతూ, హాలీవుడ్ నటులు పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తారని, కానీ భారతీయ తారలు మాత్రం తాము కమర్షియల్ తారలుగా కనిపించాలనే దృష్టికోణంలో ఉంటారని విమర్శించారు. స్టార్లు పాత్రల్లో చూపించే కొంత తరహా వైఖరిని చూపుతూ, అల్లు అర్జున్ లాంటి నటులు మాత్రం సహజంగా పాత్రలో లీనమవుతారని ఆయన ప్రశంసించారు.

అల్లు అర్జున్ పుష్ప 2 లో తన పాత్రను పూర్తి స్థాయిలో మలచిన విధానాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఒక స్టార్ గా కాకుండా నటుడిగా మారి పాత్రలో జీవం పోయడంలో అల్లు అర్జున్ సక్సెస్ అయినట్లు వర్మ అన్నారు. దీనికి ఉదాహరణగా పుష్ప 2 డైనోసార్ స్థాయి విజయం చూపించిందని వర్మ అభిప్రాయపడ్డారు. వర్మ అభిప్రాయం ప్రకారం, భారతీయ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించడంలో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించారని, ఈ సినిమా విజయం ఇతర స్టార్స్ కళ్లు తెరిపించే అవకాశాన్ని కల్పించిందని అన్నారు.

భవిష్యత్తులో స్టార్లు పాత్రల పట్ల చూసే విధానం పూర్తిగా మారిపోయేలా ఈ సక్సెస్ ప్రభావం చూపుతుందని వర్మ నొక్కి చెప్పారు. స్కా అల్లు అర్జున్ కథను మలచిన విధానం, పాత్రల పట్ల చూపించిన నిబద్ధత ప్రతీ నటుడికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ తరహా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన రెండు సార్లు పుష్ప మేనియా గురించి పాజిటివ్ గా స్పందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాత్రను ఉదాహరణగా తీసుకోవాలి అని ఒక హింట్ ఇచ్చారు.

Tags:    

Similar News