RGVని ఫస్ట్ టైమ్ బయటపెట్టిన జర్నలిస్ట్.. చేతకాక ఆవేశం!?

ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌ లోని నివాసానికి వెళ్లారు మద్దిపాడు పోలీసులు.

Update: 2024-12-03 05:34 GMT

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. వ్యూహం మూవీ టైమ్ లో చంద్రబాబు, పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవీపై కేసు నమోదైంది.. అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని చెప్పారు. అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని చెప్పారు. ఆ సమయంలో పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా.. తిరిగి వారిపై తీవ్రంగా ఆవేశపడి మండిపడ్డారు.

"ఇప్పటికే పలు కేసుల్లో జైలుకెళ్తున్న వారు.. గుర్తు లేదు మర్చిపోయాం అంటున్నారు.. ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇవ్వండి. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ వద్దకు వచ్చిన తరువాత రెండు రోజులు మీరు కనిపించలేదు" అని జర్నలిస్ట్ అన్నారు. దీంతో రెండు రోజులని ఎలా చెబుతున్నారు? వాళ్ళు ఉన్నది రెండు గంటలేనని ఆర్జీవీ అన్నారు.

పోలీసులు మీకు చెప్పారా? రెండు రోజుల నుంచి నాకోసం గాలిస్తున్నారనే వీడియో చూపిస్తే వెంటనే రూ.లక్ష ఇస్తానని ఆర్జీవీ అన్నారు. అయితే ప్రెస్ మీట్ అయ్యాక ఆడియో వినిపిస్తానని జర్నలిస్ట్ తెలిపారు. అయితే ఆడియో ఎవరికి కావాలి? ఎవరన్నా మాట్లాడతారని, వీడియో చూపించడన్న ఆర్జీవీ.. ఆ తర్వాత సదరు జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు.

"మేము క్వశ్చన్స్ అడిగాలి.. మీరు ఆనర్స్ ఇవ్వాలి.. వాదిస్తున్నారెందుకు" అని జర్నలిస్ట్ అనగా.. ప్రూఫ్ చూపించకుండా మాట్లాడొద్దని ఆర్జీవీ అన్నారు. సినిమా షూటింగ్ అని చెప్పారు కదా.. అది ఏ మూవీ అని అడిగితే.. నేనేందుకు చెప్పాలని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అసలు నీవు పోలీసువా.. నేను నీతో మాట్లాడనని ఆ ప్రశ్నను దాటవేశారు

పోలీసులకు చాలా రైట్స్ ఉంటాయని, వారు ఎక్కడ అని అడిగితే షూటింగ్ లో ఉన్నట్లు చెప్పానని తెలిపారు. కానీ ఎక్కడా? ఏంటి? అరెస్ట్ చేయడానికి వచ్చామని తనకు చెప్పలేదని అన్నారు. నార్మల్ గా పోలీసులు ఇంటికి వస్తే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా అంతా తీసుకుంటారని మరి పోలీసులకు మీరేమైనా అడిగారా అని ఆర్జీవీని జర్నలిస్ట్ ప్రశ్నించారు. వాళ్లు వచ్చినప్పుడు తాను లేనని, ఆ తర్వాత తనను పోలీసులు కమ్యూనికేట్ చేయలేదని తెలిపారు. ఇప్పటికీ తాను కార్టూన్స్ ను ఇంకా పోస్ట్ చేస్తూనే ఉన్నానని చెప్పారు.


Full View


Tags:    

Similar News