ఆర్జీవి.. రాజమౌళి.. సంచలనం కాబోతున్న ఇంటర్వ్యూ..!

అందులో ఒకరు శివతో సినిమా గమనాన్ని మార్చిన ఆర్జీవి ఐతే.. మరొకరు తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన రాజమౌళి ఉన్నారు

Update: 2024-10-20 14:00 GMT

ఇద్దరు గొప్ప దర్శకులు ఒకే ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. అందులో ఒకరు శివతో సినిమా గమనాన్ని మార్చిన ఆర్జీవి ఐతే.. మరొకరు తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన రాజమౌళి ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే వేదిక షేర్ చేసుకుంటేనే ఆడియన్స్ అంత ఒకరి గురించి మరొకరు ఏం మాట్లాడతారు అన్నది ఎగ్జైట్ అవుతారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఆర్జీవి ఇంటర్వ్యూలు ఇవ్వడం కామనే. ఆయనకు ఏం ఆలోచన వచ్చినా సరే అటు సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక ఇంటర్వ్యూ ద్వారానో బయట పెడుతుంటారు.

ఐతే రాజమౌళి ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సినిమా రిలీజ్ టైం లో తప్ప పెద్దగా ఇంటర్వ్యూస్ గానీ చిట్ చాట్ కు ఛాన్స్ ఇవ్వరు. ఈ మధ్య దేవర ఫస్ట్ డే చూసిన జక్కన్న దేవర సక్సెస్ పార్టీలో దర్శనమిచ్చారు. ఐతే ఆర్జీవి, రాజమౌళి ఇద్దరు కలిసి ఇంట్ర్వ్యూలో పాల్గొంటే అదో సంచలనమని చెప్పొచ్చు. ఇద్దరు తెలుగు సినిమాకు తమ ప్రతిభతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చారు.

ఆహాలో అన్ స్టాపబుల్ లానే ఈటీవీ విన్ వారు కూడా ఒక స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కాకుండా ఆహా అన్ స్టాపబుల్ కి పోటీగా అమేజాన్ ప్రైమ్ వారు కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ చిట్ చాట్ షోకి రానా దగ్గుబాటి హోస్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. రానా ఇదివరకు కూడా హోస్ట్ గా నెంబర్ 1 యారి షో హోస్ట్ చేశాడు. ప్రైం వీడియో ఏర్పాటు చేస్తున్న ఈ స్పెషల్ చాట్ షోకి హోస్ట్ గా రానా వ్యవహరిస్తాడని తెలుస్తుంది.

ఈ టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ లుగా ఆర్జీవి, రాజమౌళి వస్తారని టాక్. ఈ ఇద్దరు కలిస్తే సినిమా గురించి తప్ప మరో ఆలోచన ఉండదు. నెక్స్ట్ జనరేషన్ సినిమా ఎలా ఉండబోతుంది. రాబోతున్న సినిమా టెక్నాలజీ ఏంటి వీటిపై జక్కన్న ఐడియాలజీ ఏంటి.. ఆర్జీవి దాన్ని ఎలా సమర్ధిస్తారు లాంటి విషయాలు చర్చల్లోకి వస్తాయి. కచ్చితంగా ఈ షో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. రాజమౌళి, ఆర్జీవీల తర్వాత నాగ చైతన్య, శోభిత కూడా ఈ టాక్ షోకి వస్తారని టాక్. మొత్తానికి ఆహాకి పోటీగా అమేజాన్ ప్రైమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News