మనసు పెట్టేదెప్పుడు? మమ్మల్ని మెప్పించేదెప్పుడు?
సంచలనాల రాంగోపాల్ వర్మ ను ఎంతగా ద్వేషిస్తారో? అంతకు మించి ఆయనంటే అభిమానం చూపిం చేది మరెంతో మంది.;

సంచలనాల రాంగోపాల్ వర్మ ను ఎంతగా ద్వేషిస్తారో? అంతకు మించి ఆయనంటే అభిమానం చూపిం చేది మరెంతో మంది. వర్మ కనిపించినప్పుడల్లా ఆయనలా ఉండే భావజాలన్ని బయటపెట్టే యువత లేకపోలేదు. వర్మా ఏంటీ ఖర్మా అంటూనే ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తుంటారు. వర్మ మారాల నుకుంటున్నాను? అన్నది కూడా అలాంటి వాళ్ల కోసమేనని ఆయన మాటల్లో అర్దమవుతుంది.
వర్మ మనసు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆ మనసే ఎప్పుడు పెడతాడో? ఆయన అభిమానులకు అర్దం కావడం లేదు. ఆయన నుంచి అభిమాని కాలరెగరేసే సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు చూపిస్తాం వర్మ పై మా అభిమానం అంటూ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. వర్మకు సరైన హిట్ పడి చాలా కాలమవుతుంది.
చాలా సినిమాలు చేస్తున్నాడు గానీ అవి సరై ఫలితాలు సాధించడం లేదు. మధ్యలో తన శిష్యుల్ని కూడా రంగంలోకి దించుతున్నాడు. తన ఐడియాలజీని షేర్ చేసి వాళ్లతో కథలు రాయించి తానే నిర్మాతగా మారి డైరెక్టర్లగా పరిచయం చేస్తున్నాడు. ఇటీవలే `శారీ` అనే సినిమా అలా రిలీజ్ అయిందే. ఇటీవల రిలీజ్ అయిన `శారీ` కూడా అభిమానుల ఆశలపై నీళ్లు జల్లేసింది. ఈ సినిమాతోనైనా కనీసం నిర్మాతగానైనా వర్మ సౌండింగ్ వినిపిస్తుంది అనుకుంటే? అదీ జరగలేదు.
ఇదీ కూడా వర్మ మార్క్ రొటీన్ చిత్రంగానే తేలిపోయింది. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉన్న సమయం లోనే వర్మ మారతాడని... అందరికీ నచ్చే సినిమాలు చేస్తానని ప్రామిస్ కూడా చేసాడు. ఆ మాట కోట దాటింది తప్ప! ఇంత వరకూ నిలబెట్టుకోలేదు. ఇలాగైతే వర్మపై అభిమానం ఇంకా బలహీనపడుతుంది సుమీ అంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు వెళ్తున్నాయి.