దౌడ్ కాదు షూటింగ్... రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల!

ఈ సమయంలో అనూహ్యంగా వర్మ నుంచి ఓ వీడియో విడుదలయ్యింది. ఇందులో వర్మ తనదైన లాజిక్కులు లాగారు!

Update: 2024-11-27 04:04 GMT

రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసులు అనే ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వర్మ కోసం ఏపీ పోలీసులు వెతుకుతుండగా.. ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైపోయారనే కామెంట్లు వినిపించాయి. దీంతో... వర్మ అక్కడున్నారు, వర్మ ఇక్కడున్నారు అంటూ ప్రచారలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఓ వీడియో విడుదల చేశారు.

అవును... నవంబర్ 19న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. నాలుగు రోజులు సమయం కోరిన వర్మ... 25వ తేదీన విచారణకు రావాలంటూ పోలీసులు ఇచ్చిన రెండో నోటీసు అందుకున్నారు! అయినప్పటికీ విచారణకు హాజరుకాలేదు. ఆయన కోరిన ఆన్ లైన్ విచారణకు పోలీసులు అంగీకరించలేదు.

మరోపక్క ఆర్జీవీ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగా.. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇందులో భాగంగా... నేడు ఆ పిటిషన్ విచారణకు రానుందని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా వర్మ నుంచి ఓ వీడియో విడుదలయ్యింది. ఇందులో వర్మ తనదైన లాజిక్కులు లాగారు!

ఈ వీడియోలో... తాను భయపడిపోయానని, పారిపోయానని ఊహాగాణాలు ప్రసారం చేస్తున్నవారికి, మీడియాకు తన వీడియో నిరాశ పరచవచ్చు అంటూ తనదైన శైలిలో మొదలిపెట్టారు ఆర్జీవీ! అనంతరం..."నేను సుమారు ఏడాది క్రితం ఏదో ట్వీట్ పెట్టాను.. అనేది ఆరోపణ. ఆ ట్వీట్ పై ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి"! అని అన్నారు.

"ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్స్ వల్ల.. నాలుగు పోలీస్ స్టేషన్స్ పరిధిలో, నాలుగు డిఫరెంట్ ప్లేసెస్ లో, నాలువు రోజుల వ్యవధిలో, ఆ నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్లు ఆ పరంగా కేసులు పెట్టారు. తాను ఎవరిపై అయితే ట్వీట్లు పెట్టానని చెబుతున్నారో వాళ్లకు లేదు" అని అన్నారు.

"ఎవరో థర్డ్ పార్టీ.. వాళ్లకు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు. దీంతో... అసలు ఇది కేసు ఎలా అవుతుందనేది నాకొచ్చిన అనుమానం! ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుద్ధంగా చేసుకొని పాలన సాగిస్తున్నారు. అది అమెరికాలోనూ, యూరప్ లోనూ జరుగుతుంది.. ఇక్కడా జరుగుతుంది" అని పేర్కొన్నారు!

"నేను ఏ ఒక్క పోలీసు అధికారిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ బ్లేం చేయడం లేదు. నాకు ఒక నోటీసు వచ్చింది.. దానికి నేను ఫలానా తారీఖున వస్తున్నానని రిప్లై ఇచ్చాను.. అప్పటికే జరుగుతున్న ఫిల్మ్ షెడ్యూల్ ఉంది కాబట్టి రావడం అవ్వలేదు.. ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుందని జరగలేదు!"

దీంతో... నేను మళ్లీ టైం అడిగాను. ఇదేమీ అర్జెంట్ కేసాండి.. వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్ చూసిన వ్యక్తికి, వన్ వీక్ లో అన్నీ అయిపోవాలని అర్జెంట్ ఉంటుందా" అని వర్మ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట సందడి చేయడం మొదలుపెట్టింది.

మరోపక్క... సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. ఈ పిటిషన్స్ పై వర్మ తరుపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరగా.. అందుకు అంగీకరించిన ఆయన బుధవారం విచారణ జరుపుతామని చెప్పారని తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News