ఆర్జీవి సిస్టర్ విజయిజం..!
విజయిజం తో ఆర్జీవి సోదరి విజయ కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇన్నాళ్లు ఆర్జీవి సినిమాలకు సపోర్ట్ గా కెమెరా వెనక ఉన్న ఆమె ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నారు.
ఆర్జీవి రాముయిజం చదివిన వారు ఎవరైనా సరే కచ్చితంగా కొత్త అనుభూతికి లోనవ్వక తప్పదు. ప్రపంచంలో అందరు గెలుపుకోసం ప్రయత్నిస్తారు.. ఓడిపోవడం గురించి భయపడుతుంటారు కానీ ఆర్జీవి మాత్రం ఓడిపోవడమే విజయం అన్నట్టుగా చెబుతాడు. ఆర్జీవి మాటలను డీకోడ్ చేసి అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అని చెప్పొచ్చు. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆర్జీవి అన్ని తెలిసిన ఒక మనిషి.. అతను మంచోడా చెడ్డోడా అన్నది ఇక్కడ పాయింట్ కాదు కానీ అన్ని తెలుసు అన్నది మాత్రం నిజం.
ఐతే తన ఇంట్లో వాళ్లు కూడా ఆర్జీవిలానే దేనికి వెనకడుగు వేయరు. ఆర్జీవి రాముయిజం స్ఫూర్తితో ఆయన సోదరి విజయ కొత్తగా విజయిజం అనే ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. విజయిజం అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. ఈ ఛానెల్ లాంచింగ్ కార్యక్రమంలో ఆర్జీవి తో పాటు చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ఐతే ఆర్జీవి రాముయిజం ప్రపంచంపై తన విశ్లేషణ అయితే.. విజయిజం ఇంటి మీద తన విశ్లేషణ అన్నారు.
కొన్ని విషయాలు ప్రస్తావించడం వల్ల కొంతమందికి సపోర్ట్ దొరుకుతుంది.. కొంతమందికి ఆలోచన మొదలవుతుంది.. కొంతమందికి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇలా తనకు తెలిసిన విషయాల గురించి స్వప్న ఇంటర్వ్యూ చేత చెప్పాలని అనుకున్నా అంటూ ఆర్జీవి సోదరి విజయ చెప్పుకొచ్చారు. ఆర్జీవి విశ్లేషణ ప్రపంచం పై ఉంటే తన విశ్లేషణ కేవలం ఒక ఇంటి గురించి ఉంటుందని అన్నారు.
ఐతే సోదరి విజయిజం ని లాంచ్ చేస్తూ ఆమె రాముయిజం చదివాకే ఇది మొదలు పెట్టా అదే తన స్పూర్తి అంటే.. ఆర్జీవి మాత్రం తన వల్ల కాదంటూ ఎప్పటిలానే ఒక అర్థం కాని ట్వీట్ తో విజయిజం ఛానెల్ లాంచ్ లింక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విజయిజం తో ఆర్జీవి సోదరి విజయ కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇన్నాళ్లు ఆర్జీవి సినిమాలకు సపోర్ట్ గా కెమెరా వెనక ఉన్న ఆమె ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నారు.
ఏదో ఒకటి ఓడిపోయినా పర్లేదు ప్రయత్నం చేద్దాం అనుకుని విజయిజం మొదలు పెట్టాను. ఇది మొదలు పెట్టడమే తన మొదటి సక్సెస్ అని.. ఇది ఎలా వెళ్లినా తనకు సంతోషమే అని అన్నారు విజయ. మొత్తానికి రాముయిజం కు పోటీగా ఆయన సోదరి విజయిజం మొదలు పెట్టారు. మరి దీనిలో ఎలాంటి విషయ విశ్లేషణలు ఉంటాయన్నది చూడాలి.