ఇక రామ్ చ‌ర‌ణ్ తో రొమాన్సే!

ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ -జాన్వీక‌పూర్ పై కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రీక‌రించనున్నాడుట‌.

Update: 2025-02-15 13:06 GMT

రామ్ చ‌ర‌ణ్ ఆర్సీ 16 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రెండు షెడ్యూళ్ల‌ను పూర్తి చేసిన అనంత‌రం చ‌ర‌ణ్ ఫ్యామిలీతో విదేశాల‌కు వెకేష‌న్ కి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఉపాసాన‌, పాపాయితో వెకేష‌న్ లో ఉన్నాడు. మ‌రి ఈ వెకేష‌న్ ఎన్ని రోజులు అన్న‌ది తెలియ‌దు గానీ... బుచ్చిబాబు మాత్రం తదుప‌రి షెడ్యూల్ కు రంగం సిద్దం చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ -జాన్వీక‌పూర్ పై కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రీక‌రించనున్నాడుట‌.

ఆ స‌న్నివేశాలు ఎంతో రియ‌లిస్టిక్ గా ఉంటాయ‌ని స‌మాచారం. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు రామ్ చ‌ర‌ణ్ వాటిలో నో చెప్ప‌కుండా న‌టించాల్సేందేన‌ని వినిపిస్తుంది. టాలీవుడ్ హీరోల్లో ఇంత వ‌ర‌కూ జాన్వీ కపూర్ కూడా ఎవ‌రితోనూ రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. తొలి సినిమా `దేర‌వ‌`లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టించినా ఆ కాంబినేష‌న్ లో స‌న్నివేశాలే లేవు. క‌పూర్ బ్యూటీ స్కిన్ షో సీన్స్ త‌ప్ప తార‌క్ తో రొమాన్స్ కొర‌టాల ఛాన్స్ ఇవ్వ‌లేదు.

ఇప్పుడా ఛాన్స్ బుచ్చిబాబు ద్వారా చ‌ర‌ణ్ తో ద‌క్కింది. రొమాంటిక్ స‌న్నివేశాల్ని బుచ్చిబాబు బాగా ఎంగేజ్ చేయ‌గ‌ల‌డు. తొలి సినిమా `ఉప్పెన‌`లో? వైష్ణ‌వ్ తేజ్- కృతిశెట్టి మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ కి థియేట‌ర్లో విజిల్స్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో బుచ్చిబాబు లో రొమాంటిక్ యాంగిల్ ఎక్కువ‌గానే ఉంద‌న్న విష‌యం అర్ద‌మైంది. తాజాగా చ‌ర‌ణ్ సినిమా కోసం రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఎక్క‌డా త‌గ్గేలా క‌నిపించ‌లేదు.

రామ్ చ‌ర‌ణ్‌-జాన్వీకపూర్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నిశాలు తెర‌పై క‌నిపిస్తే? ఎలాంటి బీభ‌త్సం ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌- జాన్వీ క‌పూర్ తొలి షెడ్యూల్ లో క‌లిసి కొన్ని స‌న్నివేశాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత జాన్వీ బాలీవుడ్ సినిమా షూటింగ్ తో బిజీ అయింది. తాజాగా మొద‌ల‌య్యే ఆర్సీ 16 కొత్త షెడ్యూల్ లో య‌ధావిధిగా జాయిన్ అవుతుంది.

Tags:    

Similar News