రామ్ కి ఆ డైరెక్టర్ దొరికే ఛాన్స్ ఉందా..?
డైరెక్టర్ హీరో కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. దాదాపు అంతా ఓకే అనుకునే టైం లో ఎక్కడో ఒక చిన్న డౌట్ కొద్దీ ఆ ప్రాజెక్ట్ లను ఆపేస్తుంటారు.
డైరెక్టర్ హీరో కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. దాదాపు అంతా ఓకే అనుకునే టైం లో ఎక్కడో ఒక చిన్న డౌట్ కొద్దీ ఆ ప్రాజెక్ట్ లను ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ వరుస హిట్లు మీద హిట్లు కొట్టి హీరోకి దొరికే ఛాన్స్ లేకుండా బిజీ అవుతారు. ఈ పరిస్థితి ప్రస్తుతం హీరో రామ్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ తను చేస్తున్న ప్రతి సినిమాలో తన ఎనర్జీ తో ఫ్యాన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా రామ్ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటాడు.
ఐతే కెరీర్ పరంగా రేసులో కాస్త వెనకపడినట్టు ఉన్నా కూడా ప్రతి కొత్త సినిమాకు ఫ్యాన్స్ లో జోష్ తెస్తాడు రామ్. ప్రస్తుతం రామ్ మహేష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ లుక్ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్ గా ఉంటాయని అంటున్నారు. ఐతే రీసెంట్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో రామ్ సినిమా గురించి చర్చలు జరిగాయి. అసలైతే రామ్ అనిల్ రావిపూడి కలిసి రాజా ది గ్రేట్ సినిమా చేయాలి.
రామ్ అఫీషియల్ గానే ఆ ప్రాజెక్ట్ గురించి తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఐతే సినిమా ఓకే అనుకున్నాక లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గారు. అంతా రామ్ తో అనిల్ కి తేడాలు వచ్చాయని చెప్పారు. కానీ అనిల్ రావిపూడి రైటర్ గా ఉన్నప్పటి నుంచి రామ్ బాగా తెలుసు. అతను చేసిన మాస్ సినిమాలకు అనిల్ రైటింగ్ అందించాడు. ఐతే వరుస మాస్ సినిమాలు అవుతున్నాయని అనుకుని రాజా ది గ్రేట్ వద్దనుకున్నారట. ఐతే అప్పుడు మిస్సైన ఈ కాంబో మళ్లీ కలిసి చేయలేదు.
ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమా అంటే ఆల్మోస్ట్ సూపర్ హిట్ పక్కా అనేలా సెట్ చేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీజనల్ సినిమాతో 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టాడు. క్రెడిట్ లో ఎక్కువ శాతం వెంకటేష్ కి ఇచ్చినా అనిల్ డైరెక్షన్, ప్రమోషనల్ కాన్సెప్టులు అన్ని బాగా వర్క్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. మరి అలాంటిది రామ్ తో అనిల్ రావిపూడి సినిమా చేయడం ప్రస్తుతానికి అయితే కష్టమే అని చెప్పొచ్చు. ఐతే రామ్ లోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకునేలా అనిల్ మార్క్ సినిమా వస్తే మాత్రం హిట్ పడినట్టే అని చెప్పుకుంటున్నారు.