రామ్ 22: మిస్టరీతో కూడిన ప్రీ-లుక్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదలైన డబుల్ ఐస్మార్ట్ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రామ్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. అయితే ఈ చిత్రానికి ముందు నుంచే రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక వెంటనే స్టార్ట్ చేయకుండా కొంత టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ తన కొత్త సినిమా ప్రకటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
మైత్రి ప్రొడక్షన్ లో రామ్ ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో కొంతమంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికి ఇప్పుడు ఫైనల్ గా అఫీషియల్ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేయగా, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. #RAPO22గా వర్కింగ్ టైటిల్ గా చిత్రాన్ని నవంబర్ 21న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారు.
నవీన్ పిలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసి హిట్ అందుకున్న మహేశ్ బాబు పి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. అతను రామ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఈ ప్రాజెక్ట్‌పై చాలా చర్చలు జరిగాయి. ప్రీ-లుక్ పోస్టర్‌ను చూస్తే, ఒక సాదాసీదా మధ్యతరగతి వ్యక్తి తన సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు అతని నడకకు సంబంధించిన ఓ పెద్ద నీడ కనిపిస్తుంది. ఈ పోస్టర్ సింపుల్ గా కనిపించినా, రామ్ అభిమానుల్లో చాలా ఆసక్తి పెంచింది. సినిమా ఒక వినూత్న కాన్సెప్ట్‌తో ఉంటుందని అర్ధమవుతుంది. ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వాలని రామ్ ఆలోచించినట్లు తెలుస్తోంది. ఊర మాస్ లవర్ బాయ్ అనే ట్యాగ్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఒక కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమైనట్లు సమాచారం.
ఈ సినిమా రామ్ కెరీర్ లోనే ఒక బిగ్ యూ టర్న్ మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సినిమాలో కూడా తన పాత్రల ద్వారా కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న రామ్ ఇప్పుడు మహేష్ డైరెక్ట్ చేయబోయే కథలో అంతకుమించిన పెర్ఫెమెన్స్ తో మెప్పిస్తాడాని అంటున్నారు. అలాగే ఈ సినిమా ద్వారా ఆయన మరింత పేరును తెచ్చుకుంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయాల్సి ఉంది.