గోదారి గట్టు నుంచి 'ఓజీ'... రమణ గోగుల న్యూ జర్నీ

తెలుగు సంగీత ప్రియులకు రమణ గోగుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Update: 2024-12-21 20:30 GMT

తెలుగు సంగీత ప్రియులకు రమణ గోగుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌తో పాటు ఎంతో మంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ముఖ్యంగా రమణ గోగుల సంగీతాన్ని అందించిన తమ్ముడు, బద్రీ, ప్రేమంటే ఇదేరా, యువరాజ్‌ ఇలా ఎన్నో సినిమాలకు తనదైన విభిన్న సంగీతాన్ని ఇచ్చిన రమణ గోగుల మరోసారి తన మార్క్‌ను చూపించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడిగానే కాకుండా మంచి సింగర్‌గానూ రమణ గోగులకు గుర్తింపు ఉంది. కనుక ఆయనను పట్టుబట్టి మరీ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం తీసుకు వచ్చి గోదారి గట్టు పాట పాండించాడు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన గోదారి గట్టు పాటకు మంచి స్పందన వచ్చింది. రమణ గోగుల, మధు ప్రియ పాడిన ఆ పాట ఈమధ్య కాలంలో సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పాట హిట్‌ నేపథ్యంలో రమణ గోగుల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట ఇంత హిట్ అయిన నేపథ్యంలో మళ్లీ తాను సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే ఆయనను తమ సినిమాల్లో పాటలు పాడించేందుకు గాను సంగీత దర్శకులు, హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు.

త్వరలోనే ఓజీ సినిమా కోసం రమణ గోగుల పాట పాడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌కి రమణ గోగుల అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే సినిమాలోని పాటలను పాడేందుకు గాను ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. తమన్‌ ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాకు పాట పాడేందుకు అవకాశం వస్తే కచ్చితంగా ఎంతటి సింగర్ అయినా వెనక్కి తగ్గేది లేదు. అలాగే ఈ సినిమాలో రమణ గోగుల పాట పాడటం కన్ఫర్మ్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. అతి త్వరలోనే ఓజీ కోసం రమణ గోగుల పాటను తమన్‌ రికార్డ్‌ చేస్తాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌ తో రమణ గోగులకు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రమణ గోగుల మాట్లాడుతూ తమ్ముడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న సమయంలో హీరోకి ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చే పాట కావాలి. అందుకోసం గంటలు గంటలు చర్చలు జరిగాయి. ఏ ఒక్కటి ఫైనల్‌ కాలేదు, చివరకు లుక్‌ ఎట్‌ మై ఫేస్ ఇన్‌ ది మిర్రర్‌ అని మరణ గోగుల పాడిన వెంటనే పవన్ కళ్యాణ్‌ అదే ఇంగ్లీష్ సాంగ్‌ను స్ఫూర్తిని నింపే విధంగా మంచి మ్యూజిక్‌తో తీసుకు వెళ్దామని అన్నారు. అలా ఆ పాట వచ్చిందని అన్నారు. అందుకే మరోసారి అలాంటి మంచి పాటలను పవన్ కళ్యాణ్ కోసం రమణ గోగుల ఇవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News