మెగాస్టార్ మూవీలో పాడనున్న రమణ గోగుల
ఒకప్పుడు సింగర్ గా రమణ గోగుల సాంగ్స్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన పాట పాడాడంటే అది సూపర్ హిట్టే.;
ఒకప్పుడు సింగర్ గా రమణ గోగుల సాంగ్స్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన పాట పాడాడంటే అది సూపర్ హిట్టే. అలాంటి ఆయన అమెరికా వెళ్లి సెటిలై సినీ ఇండస్ట్రీకి గత కొంత కాలంగా దూరమయ్యాడు. దీంతో ఇక ఆయన పాటలు పాడడని అందరూ ఫిక్సయ్యారు. సరిగ్గా ఈ టైమ్ లో ఆయన్ను వెనక్కి తీసుకొచ్చి మ్యాజిక్ చేశాడు అనిల్ రావిపూడి.
అమెరికాలో ఉంటున్న రమణ గోగులను ఒప్పించి ఇండియాకు తీసుకొచ్చి సంక్రాంతికి వస్తున్నాంలో భీమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ కు పాడించి మంచి క్రెడిట్ అందుకున్నాడు అనిల్. ఆయన పాడిన గోదారి గట్టు మీద సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా ఓపెనింగ్స్ లో ఆ సాంగ్ ఎంతో కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గోదారి గట్టు మీద సాంగ్ చార్ట్ బస్టర్ అవడంతో రమణ గోగులకు ఒక్కసారిగా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులతో పాట పాడించాలని చూస్తున్నప్పటికీ ఆయన మాత్రం సాంగ్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగా స్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే.
చిరూ- అనిల్ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియోనే సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ భీమ్స్ చిరూ మూవీ కోసం ఓ పెప్పీ ట్యూన్ ను కంపోజ్ చేశాడని, ఆ పాట ఫోక్ స్టైల్ లో ఉంటూనే మాస్ టచ్ తో అదిరిపోతుందని అంటున్నారు. రీసెంట్ గా ట్యూన్ విన్న చిరూ చాలా బావుందని భీమ్స్ కు చెప్పారట. పాట రికార్డింగ్ తర్వాత అంచనాలు పెరిగిపోయడం ఖాయమంటున్నారు.
గతంలో చిరూ తమ్ముడు పవన్ కు రమణ గోగుల ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరూ కోసం రమణ పాడితే ఆ రీచ్ ఎలా ఉంటుందో చూద్దామని అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అనిల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్లి ఈ ఏడాది చివరికల్లా సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనిల్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.