ఆర్సీ16లో నెక్ట్స్ లెవెల్ ఫ్లాష్ బ్యాక్

ఈ ఫ్లాష్ బ్యాక్ ను డైరెక్ట‌ర్ బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది.

Update: 2025-02-15 04:48 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస‌ఫ్లాపుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ నుంచి రెండు సినిమాలు రిలీజ‌య్యాయి. అందులో ఒక‌టి ఆచార్య కాగా మ‌రొక‌టి గేమ్ ఛేంజ‌ర్. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపులుగానే నిలిచాయి. దీంతో మెగా ఫ్యాన్స్ త‌మ ఆశ‌ల‌న్నింటినీ చ‌ర‌ణ్ చేయబోయే తర్వాతి సినిమా పైనే పెట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌ర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఆర్సీ16 కోసం చ‌ర‌ణ్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

గేమ్ ఛేంజ‌ర్ సినిమా మొత్త‌మ్మీద ఆడియ‌న్స్ కు కొద్దో గొప్పో న‌చ్చేదంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాలే. ఇప్పుడు చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయ‌ని తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ విష‌యంలో ఎంతో ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ను డైరెక్ట‌ర్ బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చ‌ర‌ణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని, అందులోని ఓ పాత్రలో నార్మ‌ల్ గానే క‌నిపించ‌నున్న చ‌ర‌ణ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం ఏకంగా 10 కేజీల బ‌రువు త‌గ్గ‌నున్నాడ‌ట‌. ఇదంతా వింటుంటే చ‌ర‌ణ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్ట‌డం ఖాయంలానే అనిపిస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ తో పాటూ వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించ‌నుంది. ఆర్సీ16కు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం రెహ‌మాన్ మూడు ట్యూన్స్ ను కూడా రెడీ చేసిన‌ట్టు స‌మాచారం.

Tags:    

Similar News