38 వ‌చ్చేశాయ్.. ఇంకెప్పుడు పెళ్లి తేజ్?

మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.

Update: 2024-12-13 12:30 GMT

మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బావ చ‌ర‌ణ్ అంటే తేజ్ కి వ‌ల్ల‌మాలిన అభిమానం ప్రేమ‌... సాయి తేజ్ అంటే చ‌రణ్ కి గొప్ప ప్రేమాభిమానాలు.. ఆ ఇరువురి న‌డుమా ప‌రాచికాలు అభిమానుల‌ను కూడా ఆట‌ప‌ట్టించాయి. ఆ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై ఉంటే సంద‌డి ఎలా ఉంటుందో నిన్న `సంబ‌రాల ఏటిగ‌ట్టు` సినిమా ప్ర‌చార వేదిక‌పై చూసాం. వేదిక‌పై సాయి దుర్గ తేజ్ ని టీజ్ చేస్తూ చ‌ర‌ణ్ ప‌రాచికం అంద‌రినీ న‌వ్వించింది. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే అక్క‌డ ఫ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని ప్రూవైంది. అలాగే సాయి ధ‌ర‌మ్ మాతృమూర్తి విజ‌య దుర్గ అక్క అంటే చ‌ర‌ణ్ కి ఎంత‌టి ప్రేమాభిమానాలో కూడా అత‌డి మాట‌ల్లో అర్థ‌మైంది.

అదంతా స‌రే కానీ.. ఈ బావా అల్లుళ్ల మ‌ధ్య ప‌రాచికం ఇప్పుడు అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాకి ప్ర‌చారం చేసి పెట్టిన చ‌ర‌ణ్ ప‌నిలో ప‌నిగా ఇదే వేదిక‌పై అత‌డి పెళ్లి గురించి కూడా ప్ర‌స్థావించాడు. తేజ్ ప్రేమ గురించి రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగా మాట్లాడాడు. అత‌డు మాట్లాడుతూ-``తేజ్‌ ప్రేమ బండ ప్రేమ. అంత గట్టిగా పట్టుకుంటాడు. అంత గట్టిగా ప్రేమిస్తుంటాడు. ఈ బండ ప్రేమ మగాళ్లకు చూపిస్తున్నాడు. ఆడవాళ్లకు చూపించడం లేదు. వాళ్ల అమ్మ ఇదే మొత్తుకుంటున్నారు. తొందరగా పెళ్లి చేయాలని కోరుకుంటున్నా`` అంటూ తేజ్‌ పెళ్లిపై రామ్‌ చరణ్‌ మాట్లాడారు. అలాగే సాధ్య‌మైనంత తొంద‌ర‌గా తేజ్ కి పెళ్లి చేయ‌మ‌ని వేదిక ముందు ఉన్న విజ‌య దుర్గ అక్క‌కు కూడా చ‌ర‌ణ్ చెప్పాడు. 38 వ‌య‌సు వ‌చ్చేసింది...! అంటూనే తేజ్ ని గిల్లేస్తూ చాలా ప‌రిహాసానికి పాల్ప‌డ్డాడు చ‌ర‌ణ్.

రామ్ చ‌ర‌ణ్ మాట‌ల్ని బ‌ట్టి ఇక సాయిధ‌ర‌మ్ పెళ్లికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అత‌డి త‌ల్లి గారైన విజ‌య‌దుర్గ పిల్ల‌ను వెతుకుతున్నార‌ని క్లారిటీ వ‌చ్చేసింది. 2025లో సాయి దుర్గ తేజ్ ఓ ఇంటి వాడ‌వుతాడ‌ని అభిమానులు వేదిక వ‌ద్ద ముచ్చ‌టించుకున్నారు. తోటి హీరోలంతా పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌య్యారు. ఇక తేజ్ మాత్ర‌మే పెండింగ్. ``బెండ‌కాయ ముదిరినా బ్ర‌హ్మ‌చారి ముదిరినా..`` సామెత‌ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే కొత్త సంవ‌త్స‌రంలో తేజ్ ఫ్యామిలీ శుభ‌వార్త చెబుతుంద‌నే అంతా ఆశిస్తున్నారు. మెగా కాంపౌండ్ ఆ మంచి వార్త‌ను అధికారికంగా ప్ర‌క‌టించే రోజొస్తుంద‌ని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News