బాలయ్య పిలవగానే చరణ్ పెట్ రైమ్ రియాక్షన్
ఈ ఎపిసోడ్ ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నమైనది. అనూహ్యమైనది...ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుందని ప్రేక్షకులను బాలయ్య ఆటపట్టించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ విత్ NBK షోతో అభిమానుల ముందుకు రానున్నాడు. గేమ్ ఛేంజర్ కంటే ముందు ఇది అభిమానులకు స్పెషల్ ట్రీట్ కానుంది. ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే అభిమానులలో సంచలనం సృష్టించింది. ఇది ఈ సీజన్ బెస్ట్ ఎపిసోడ్స్ లో ఒకటి కానుందని అంచనా ఏర్పడింది.
సంక్రాంతి వేడుకల నేపథ్యంలో చిత్రీకరించిన ఈ స్పెషల్ ఎపిసోడ్ సీజన్ మొత్తంలో హైలైట్ కానుంది. ఆకర్షణీయమైన హోస్ట్ నందమూరి బాలకృష్ణ (ఎన్బీకే)- చరణ్‌ల పరిహాసంతో ప్రోమో ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నమైనది. అనూహ్యమైనది...ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుందని ప్రేక్షకులను బాలయ్య ఆటపట్టించారు. NBK కూడా రామ్ చరణ్‌ను `మెగా ఫ్యామిలీ స్టార్` అని ఆప్యాయంగా పిలిచారు. ఇరువురి నడుమా సరదా పరిహాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
2025లో మనవడు కావాలనే కోరుకున్న చరణ్ అమ్మమ్మ అంజనా దేవి .. తల్లి సురేఖ కొణిదెల నుండి హత్తుకునే వీడియో సందేశం.. క్లిన్ కారా పుట్టినప్పుడు ఆశ్చర్యపరిచిన ఒక లోతైన భావోద్వేగ క్షణం..కుమార్తె క్లిన్ వీడియో ఇవన్నీ ఆకట్టుకున్నాయి. క్లిన్ కారా రాకతో మెగా కుటుంబంలో ఆనందం ఎలా వెల్లివిరిసిందో కూడా తెలిపారు.
తండ్రిగా తన జీవితం గురించి, క్లిన్ కారాతో రెండు గంటల సమయం ఎలా గడుపుతాడో కూడా చరణ్ తెలిపాడు. పుట్టినప్పుడు కూతురు క్లిన్ బక్కాగా ఉందని కూడా చరణ్ అన్నాడు. క్లిన్ కు తినిపించడం సహా తనతో బంధం గురించి మాట్లాడాడు. చరణ్ కూతురి ముఖాన్ని ఎప్పుడు చూపిస్తాడో కూడా ప్రశ్న ఎదురైంది. `నాన్న` అని పిలిచినప్పుడు మీ అందరికీ క్లిన్ కారాను చూపిస్తానని చరణ్ అన్నాడు.
రామ్ చరణ్ తన ఇంట్లో స్టార్‌ని పరిచయం చేశాడు. తన ప్రియమైన పెంపుడు పెట్ రైమ్ కొణిదెలను వేదికపై పరిచయం చేసారు. రైమ్ ఈవెంట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజువల్ ఎంతో క్యూట్ గా ఆకట్టుకుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలతలు వచ్చినప్పుడల్లా రైమ్‌ని తన వద్దకు రాయబారం పంపుతానని తెలిపాడు. ఇంటిలో నిజమైన పాలకుడు అయిన రైమ్‌తో చరణ్ స్నీక్ పీక్ ఇవ్వడం చాలా నవ్వులు కురిపించింది. ఆసక్తికరంగా షో వేదికపై బాలయ్య రైమ్ పేరును పిలవగానే అది వెంటనే అటు తిరిగి కన్ను గీటడం అందరినీ నవ్వించింది.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడు శర్వానంద్ ప్రత్యేకంగా కనిపించాడు. ఎపిసోడ్‌లో రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఫోన్ కాల్ డార్లింగ్ అభిమానులను ఎగ్జయిట్ చేసింది. చరణ్-ప్రభాస్-బాలయ్య మధ్య సంభాషణలు ఆకట్టుకున్నాయి. ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలను వెల్లడించాడు. ఈ ఎపిసోడ్ లో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కనిపించారు. ఆయన బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసారు. ఓవరాల్ గా ప్రోమో ఆద్యంతం రక్తి కట్టించింది. 8 జనవరి 2025న ఫుల్ ఎపిసోడ్ ఆహా OTTలో స్ట్రీమ్ కానుంది.