మెగా సన్స్ అంతా దోసె స్పెషలిస్టులా!
ఇక మెగా ఫ్యామిలీ హీరోల విషయానికి వస్తే వీళ్లంతా దోసెలు వేయడంలో స్పెషలిస్టులు అని తెలుస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెనం మీద గుండ్రంగా దోసెలు బాగా వేస్తాడు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు వంటింటి హీరోలు కూడా ఉన్నారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుంటారు. చికెన్, మటన్ బిర్యానీ వండటంలో తారక్ చేతి వాటం చూపిస్తారు. ఆదివారం వచ్చిందంటే? అన్నయ్య కళ్యాణ్ రామ్ కి స్వయంగా బిర్యానీ చేసి పెట్టడం అలవాటు. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా మంచి పుడీ అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ వంట చేయడు కానీ తన వెంట ఎప్పుడూ చెఫ్ లు ఉంటారు. ఎలా వండాలి అన్నది వెనుకుండి గైడ్ చేస్తుంటారు ప్రభాస్.
ఇతడు మంచి నాన్ వెజ్ ప్రియడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోల విషయానికి వస్తే వీళ్లంతా దోసెలు వేయడంలో స్పెషలిస్టులు అని తెలుస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెనం మీద గుండ్రంగా దోసెలు బాగా వేస్తాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎగ్ ఆమ్లేట్లు వేయడంలో స్పెషలిస్టు. ఇద్దరు ఓ సందర్భంలో పక్క పక్కనే దోసెలు...ఆమ్లేట్ లు వేసిన సంగతి తెలిసిందే. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దోసెలు వేయడం వచ్చు అని ఎంత మంది కి తెలుసు. ఇంత వరకూ ఈ విషయం గోప్యంగానే ఉంది.
తొలిసారి తన దోసె సీక్రెట్ ని చరణ్ రివీల్ చేసాడు. ఇంటికి స్నేహితులు వచ్చినా తన కుటుంబీకులు ఎవరు వచ్చి నా చరణ్ స్వయంగా దోసెలు వేసి ఇస్తాడట. ఇప్పుడు తన కుమార్తె కోసం మాత్రం స్పెషల్ దోసెలు వేస్తున్నానన్నారు. రెగ్యులర్ గా ఒకే పనిచేస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు తాను కూడా కిచెన్ లో పని చేస్తా నన్నారు. ఇలా పనిచేయడం రిలాక్స్ గానూ అనిపిస్తుందన్నారు. మొత్తంగా మెగా ఫ్యామిలీ లో ఇద్దరు దోసె మాస్టర్లున్నారని అర్దమవుతుంది.
ఇక మెగా ఫ్యామిలీ లో మిగిలింది సాయిదుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్. మరి వీళ్లిద్దరు ఏ రకమైన వంటకాల్లో స్పెషలిస్టులా లేక కిచెన్ రూమ్ తెలియని అమాయకులా అన్నది తెలియాలి. ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` తో మెగా అభిమానుల్ని అలరించ నున్నారు. మెగా అభిమానులకు సంక్రాంతి నాలుగు రోజులు ముందుగానే వచ్చేస్తుంది.