సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. చరణ్ ఒకప్పటి ట్వీట్ వైరల్..!

సినీ హీరో తమిళనాడు సీఎం ఎం కె స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Update: 2023-09-05 05:59 GMT

సినీ హీరో తమిళనాడు సీఎం ఎం కె స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసిన సనాతన నిర్మూలన అంశంపై ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు. కొన్నిటిని మనం వ్యతిరేకించి ఊరుకోకూడదు.. వాటిని నిర్మూలించాలని అన్నారు. దోమలు. డెంగ్యూ, ఫ్లూ, మలేరియా లాంటి వాటిని వ్యతిరేకించడం కాదు నిర్మూలించాలి అలానే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

ఆయన చేసిన కామెంట్స్ తమిళనాడులోని బీజేపీ నాయకులు హిందూవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపడుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్ చేసిన ఒకప్పటి ట్వీట్ చర్చల్లోకి వచ్చింది. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని అది మన బాధ్యత అని చరణ్ 2020 సెప్టెంబర్ 11న ఒక ట్వీట్ చేశారు. తన తల్లి సురేఖ ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ సనాతన ధర్మాన్ని రక్షించాలని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఉదయనిధి స్టాలిన్ మాటలు తప్పుపడుతూ హిందూవాదులు అంతా కూడా అప్పుడు చరణ్ చేసిన ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు. అయితే వ్యవహారం ముదురుతున్నా సరే తను చేసిన కామెంట్స్ పై వెనక్కి తగ్గట్లేదు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమే అని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.

దేవుడు ఒక్కడే అనేది DMK విధానమని.. తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించాను. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని మళ్లీ చెబుతున్నానని అన్నారు. తన మాటలను బీజేపీ అనవసరంగా పెద్దది చేస్తుందని అన్నారు ఉదయనిధి స్టాలిన్. సినిమా హీరోగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ లో ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తండ్రి బాటలో రాజకీయంగా కూడా తన పంథా కొనసాగిస్తున్నారు. సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై సినీ ప్రేక్షకులు కూడా ఆయన్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News