ఒకే ప్రేమ్ లో చ‌ర‌ణ్‌-బ్రాహ్మిణి!

మొత్తానికి నారా చంద్ర‌బాబు నాయుడు నాల్గ‌వ సారి ముఖ్య‌మంత్రి అవుతోన్న వేళ వేదిక అంతా రంగుల మ‌యంగా మారింది.

Update: 2024-06-12 09:15 GMT

మొత్తానికి నారా చంద్ర‌బాబు నాయుడు నాల్గ‌వ సారి ముఖ్య‌మంత్రి అవుతోన్న వేళ వేదిక అంతా రంగుల మ‌యంగా మారింది. రాజ‌కీయ నాయ‌కులు, ఉద్దండులు అంతా భారీ ఎత్తున పాల్గున్నా చిరంజీవి.. ర‌జ‌నీ కాంత్ లాంటి స్టార్లు రావ‌డంతో అక్క‌డ స‌న్నివేశ‌మే మారిపోయింది. వాళ్ల‌కు తోడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఇక్క‌డే ఓఅరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌నే నారా బ్రాహ్మిణి కూడా ఉన్నారు.

ఇలా అనుకోకుండా ఇద్ద‌రు అక్క‌డ అలా కలుసు కోవ‌డం..ప‌క్క ప‌క్క‌నే కూర్చోవ‌డం ప్రేక్ష‌కాభిమానుల క‌న్నుల‌కు విందుగా మారింది. చ‌ర‌ణ్ న‌లుపు దుస్తుల్లోనూ...బ్రాహ్మిణి సంప్ర‌దాయ చీర‌కట్టులోనూ త‌ళుక్కున మెరిసారు. ఇద్ద‌రు స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మెగా-నంద‌మూరి అభిమానుల్ని ఆ పిక్ ఆక‌ట్టుకుంటుంది. ఇద్ద‌రు వేర్వేరు రంగాలైన క‌ల‌యిక అరుదు కావడంతోనే ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది.

చ‌ర‌ణ్ న‌టుడిగా రాణిస్తుండ‌గా, బ్రాహ్మిణి బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు. అలాగే అవ‌స‌రం మేర రాజ‌కీ యాల్లోనూ పాల్గొంటున్నారు. కాబ‌ట్టి చ‌ర‌ణ్‌-బ్రాహ్మిణి లు ఫోటోను షేర్ చేసుకోవ‌డం అన్న‌ది జ‌రిగే ప‌ని కాదు. ఇరోజు అలా యాదృశ్చికంగా చోటు చేసుకుంది. మొత్తం వేడుక‌కే ఈ పిక్ హైలైట్ అని చెప్పొచ్చు.

చ‌ర‌ణ్ త‌న బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు చరణ్ అక్కడికి రాగా, తన మామగారు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, తన భర్త నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్స‌వాన్ని తిలికించ‌డానికి బ్రాహ్మిణి వ‌చ్చారు. మూడ‌వ‌సారి తండ్రి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. దీంతో కుమార్తె ఆనందానికి అవ‌దుల్లేవ్.

Tags:    

Similar News