రామ్ ఓ మంచి వంట మాస్ట‌ర్!

టాలీవుడ్ లో మాంసాహార ప్రియులు ఎవ‌రంటే? ఠ‌క్కున గుర్తొచ్చేది ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇద్ద‌రూ ముక్క లేనిదే ముద్ద దిగ‌ని టైపు.

Update: 2024-08-18 17:30 GMT

టాలీవుడ్ లో మాంసాహార ప్రియులు ఎవ‌రంటే? ఠ‌క్కున గుర్తొచ్చేది ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇద్ద‌రూ ముక్క లేనిదే ముద్ద దిగ‌ని టైపు. ప్ర‌భాస్ వ‌ద్ద విదేశీ వంట‌గాళ్లు సైతం ఉన్నారు. ప్ర‌పంచంలో అన్నిర‌కాల నాన్ వెజ్ వంట‌కాలు వండే స్టాప్ ఉన్నారు. ఇక తార‌క్ అయితే తానే గొప్ప నాన్ వెజ్ మాస్ట‌ర్. బిరియానీ చేయ‌డంలో తానో స్పెష‌లిస్ట్. సండే వ‌చ్చిందంటే? బిర్యానీ త‌ప్ప‌ని స‌రి. స్వ‌యంగా వండి అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కి తినిపిస్తాడు.

మ‌రి వీళ్లిద్ద‌రి త‌ర్వాత అంత గొప్ప వంట మాస్ట‌ర్ ఎవ‌రంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ అని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా రివీల్ చేసాడు. వెకేష‌న్ల కోసం విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు త‌నకు న‌చ్చిన వంట‌కాల‌న్ని తానే స్వ‌యంగా వండుకుని తింటాడుట‌. అలాంటి మంచి హాస్ట‌ల్ ఒక‌టి ముందుగానే చూసుకుని అందులో దిగుతాడుట‌. ఆ త‌ర్వాత వంట‌కు కావాల్సిన అన్నింటిని తీసుకుని చెఫ్ దుస్తుల్లోకి దూరిపోతాడుట‌.

ఇలా త‌న వంట తానే చేసుకుని తిన‌డం ఎంతో ఇష్ట‌మంటున్నాడుట‌. ఖాళీగా ఉన్న స‌మ‌యంలో మంచి టైంపాస్ కార్య‌క్ర‌మం వంట అంటున్నాడుట‌. అలాగే కాఫీ తాగ‌డం అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. త‌న డే కాఫీతోనే మొద‌లవుతుంద‌న్నాడు. డే పూర్త‌య్యే లోపు ఎన్ని కాపీలు తాగుతాడో త‌న‌కే తెలియ‌దం టున్నాడు. బిర్యానీ ఇష్ట‌మైన వంట‌కాల్లో ఒక‌టంటున్నాడు. కాఫీ త‌ర్వాత ఎక్కువ‌గా తినే పుడ్ ఐటం అదే అంటున్నాడు.

అయితే ఫిట్ నెస్ జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌కుండా తీసుకుంటాడు. అతిగా తిన్నా అవ‌స‌ర‌మైన‌ప్పుడు అంతే మితంగా పుడ్ తీసుకుంటాడుట‌. వాకింగ్...యోగా లాంటివి క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తాడుట‌. `జ‌గ‌డం` సినిమా కోసం చైన్ స్మోకర్ గానూ మారాడుట‌. అయితే ఆ అల‌వాటు నుంచి బ‌య‌ట ప‌డటానికి పెద్ద యుద్ద‌మే చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు.

Tags:    

Similar News