రామ్ పోతినేని.. ఇంత మంచి ఛాన్స్ వచ్చినా..

ఇలా యంగ్ హీరో రామ్ పోతినేని రెండు ప్రైమ్ డేట్స్ ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Update: 2024-08-18 04:57 GMT

టాలీవుడ్ లో చాలా మంది యంగ్ స్టార్స్ డిఫరెంట్ కథలని చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. నాచురల్ స్టార్ నాని గత ఏడాది రెండు హిట్స్ అందుకొని తన మార్కెట్ ని అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా 100 కోట్ల వసూళ్లు గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మూవీకి మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. వీకెండ్ పూర్తి కాకుండానే ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. నిజానికి ఆగష్టు 15న పుష్ప ది రూల్ రిలీజ్ కావాల్సి ఉంది. ప్రైమ్ డేట్ కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని సుకుమార్ ఈ డేట్ ని పుష్ప 2 రిలీజ్ కి ఫిక్స్ చేశారు.

అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి పుష్ప2 వాయిదా వేశారు. దీంతో ఈ ప్రైమ్ డేట్ కి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో డబుల్ ఇస్మార్ట్ కూడా ఉంది. అయితే ఈ వీకెండ్ టాలీవుడ్ విన్నర్ గా ఆయ్ మూవీ నిలిచేలా కనిపిస్తోంది. అలాగే చియాన్ విక్రమ్ తంగలాన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళంలో తంగలాన్ బాక్సాఫీస్ విన్నర్ గా నిలించిందనే మాట వినిపిస్తోంది.

అయితే ఇంత మంచి డేట్ ని హీరో రామ్ కరెక్ట్ గా ఉపయోగించుకోలేకపోయాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ డేట్ వాయిదా పడింది. సలార్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 28 కూడా ప్రైమ్ డేట్ కావడంతో రామ్ పోతినేని స్కంద సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇది మాస్ బొమ్మగా రిలీజ్ అయినా కూడా ఆడియెన్స్ లో అంచనాలను పెంచలేకపోయింది.

ఇలా యంగ్ హీరో రామ్ పోతినేని రెండు ప్రైమ్ డేట్స్ ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ నుంచి చివరిగా వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు మూడు కూడా పంక్తు కమర్షియల్ లైన్ కథలతోనే తెరకెక్కాయి. ఇప్పుడు పబ్లిక్ ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని అస్సలు ఆదరించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం కథాబలం ఉన్న థ్రిల్లర్ మూవీస్, లేదంటే బియాండ్ ది బౌండరీస్ తో మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే స్టోరీస్ ని ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు. రామ్ కూడా అలాంటి కథలని ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News