ఆ సినిమాలో శివగామి లేదా?
ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణకి చాలా అవకాశాలు వచ్చిన సెలక్టివ్ గా మూవీస్ చేస్తోంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు సౌత్ ఇండియాని రూల్ చేసిన రమ్యకృష్ణ తరువాత తల్లి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యింది. ముఖ్యంగా ‘బాహుబలి’ సిరీస్ లో ఆమె చేసిన శివగామి క్యారెక్టర్ రమ్యకృష్ణకి విశేషమైన కీర్తి తీసుకొచ్చింది. రాజమాతగా పవర్ ఫుల్ గా లో రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణకి చాలా అవకాశాలు వచ్చిన సెలక్టివ్ గా మూవీస్ చేస్తోంది.
సినిమాలలో క్యారెక్టర్ ప్రాధాన్యత బట్టి మాత్రమే ఒప్పుకుంటుంది. ఆమె ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ సినిమాలలో కనిపించింది. ఈ రెండు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం రమ్యకృష్ణకి ఎంపిక చేశారనే టాక్ వినిపించింది.
ఇప్పటికే ఈ చిత్రంలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా కన్ఫర్మ్ అయ్యారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోందనే ప్రచారంపై కూడా మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం లేదంట. ఎవరు ఆమెని సంప్రదించలేదని టాక్ నడుస్తోంది.
శ్రీకాంత్ ఓదేల ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ అండ్ క్రూని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అనిరుద్ రవిచందర్ ని ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. అయితే అతను కూడా తప్పుకున్నాడనే ప్రచారం నడుస్తోంది. అనిరుద్ చేతిలో ఇప్పుడు అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి మెజారిటీ టైం కేటాయించాల్సి ఉంది. అందుకే ‘ది ప్యారడైజ్’ నుంచి తప్పుకున్నాడంట. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా ఈ చిత్రంలో చేయడం లేదనే న్యూస్ తెరపైకి వచ్చింది. ఆమె కూడా బిజీ షెడ్యూల్స్ కారణంగానే అందుబాటులోకి రావడం లేదట.
ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదేలతో ‘ది ప్యారడైజ్’ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.