గ్లామర్ క్వీన్ రమ్య పసుపులేటి.. క్రేజీ లుక్స్

ఈ బ్యూటీ హుషారు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Update: 2024-08-20 13:24 GMT

టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్న తెలుగమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో యంగ్ బ్యూటీస్ తమ అందంతో అవకాశాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందాల ప్రదర్శనలో కూడా నార్త్ బ్యూటీస్ కి మేమేమి తక్కువ కాదని ప్రూవ్ చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో రమ్య పసుపులేటి ఒకరు. ఈ బ్యూటీ హుషారు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.


తరువాత ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్మెంట్ సినిమాలలో రమ్య పసుపులేటి హీరోయిన్ పాత్రలలో నటించింది. ఈ సినిమాలలో గ్లామర్ పరంగా కూడా అమ్మడు అందరిని ఆకట్టుకుంది. అలాగే చదరంగం, BFF వెబ్ సిరీస్ లలో కూడా ఈ చిన్నది కీలక పాత్రలలో నటించింది. రావు రమేష్ హీరోగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రమ్య పసుపులేటి నటిస్తోంది.


ఈ చిత్రంలో రావు రమేష్ కొడుకుగా యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అంకిత్ కొయ్య నటిస్తున్నారు. అతనికి జోడీగా రమ్య పసుపులేటి కనిపించబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో రమ్య పసుపులేటి చాలా యాక్టివ్ గా పాల్గొంటోంది. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో రమ్య సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం. తాజాగా ఈ బ్యూటీ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రమోషనల్ ఈవెంట్ లో ఎల్లో కలర్ షర్టు, షార్టుతో రమ్య సందడి చేసింది.

ఈ లుక్ లో రమ్య చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుందనే మాట వినిపిస్తోంది. సరైన సినిమాలు పడితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ రమ్య పసుపులేటికి ఉన్నాయని నెటిజన్లు ఆమె ఫోటోలు చూసి కామెంట్స్ పెడుతున్నారు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత హీరోయిన్ గా తనకి అవకాశాలు పెరుగుతాయని రమ్య ఆశిస్తోంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో రమ్య కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపైన అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.

ఇప్పటికే తెలుగమ్మాయిలైన శ్రీలీల, వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని ఆస్వాదిస్తున్నారు. అలాగే కొంతమంది వర్ధమాన తారలు అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.. అందంతో పాటు అభినయంతో కూడా రమ్య పసుపులేటి టాలెంట్ చూపిస్తే కచ్చితంగా హీరోయిన్ గా ఈమెకి బ్రేక్ వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News