పిక్‌టాక్‌ : కొత్త పెళ్లికొడుకుతో లీడర్‌

ప్రతి ఫోటో, ప్రతి వీడియో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్‌గా ఉంది. ఇప్పుడు నాగ చైతన్య, రానా కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Update: 2024-12-05 06:59 GMT

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ పెళ్లి పీటలు ఎక్కారు. డిసెంబర్‌ 4వ తారీకున అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా శోభిత మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

శోభిత మెడలో అన్నయ్య నాగ చైతన్య తాళి కడుతున్న సమయంలో అక్కినేని అఖిల్‌ విజుల్స్ వేసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇంకా చాలా మంది చాలా రకాలుగా గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో వీడియోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రతి ఫోటో, ప్రతి వీడియో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్‌గా ఉంది. ఇప్పుడు నాగ చైతన్య, రానా కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీరిద్దరు బావ, బామ్మర్ది అనే విషయం తెల్సిందే. అయితే ఇద్దరు అంతకు మించి అన్నట్లుగా స్నేహంగా ఉంటారు. వీరి స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉంటారు.

నాగ చైతన్య పెళ్లి వేడుకలో రానా హడావిడి ఎక్కువగా కనిపించిందని పెళ్లికి హాజరు అయిన వారు చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉంటారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అంటూ ఎప్పుడూ తోడుగా ఉంటారు. పెళ్లి సమయంలోనూ చైతూ పక్కనే రానా ఉంటూ వచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన పలువురు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. రానా ప్రముఖంగా పెళ్లి వేడుకలో సందడి చేశారని ఈ ఫోటోలు, వీడియోలు చూస్తేనే అర్థం అవుతోంది.

లీడర్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రానా చేసిన సినిమాలకు చాలా తక్కువ అయినా నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఏది పడితే అది చేయాలని అనుకోవడం లేదని, మంచి కథలు వచ్చినప్పుడే, మంచి పాత్రలు తన వద్దకు వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానంటూ రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే తండేల్‌ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఫిబ్రవరిలో సినిమా విడుదల కాబోతుంది. సాయి పల్లవి హీరోయిన్‌గా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News