ధూమ్ 4: అత‌డు న‌చ్చ‌డం లేదా?

తాజాగా ర‌ణ‌బీర్ ధూమ్ 4 లుక్ విడుద‌ల కాగా దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Update: 2024-10-17 03:45 GMT

ధూమ్ - భార‌త‌దేశంలో ఎక్కువ‌గా అభిమానించే పాపుల‌ర్ ఫ్రాంఛైజీ. ఇందులో న‌టించిన జాన్ అబ్ర‌హాం, హృతిక్ రోష‌న్, అమీర్ ఖాన్ నెగెటివ్ షేడ్ పాత్ర‌ల్లో మెరిపించారు. ముఖ్యంగా ఆ ముగ్గురిని స‌వాల్ చేస్తూ మ‌రొక అగ్ర‌ హీరో ఈ ఫ్రాంచైజీలో క‌నిపిస్తారా? అనే దానిపై త‌ర్జ‌న భర్జ‌న సాగుతోంది. ఇంత‌లోనే ధూమ్ 4కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి ట్యాటెంటెడ్ హీరోని బ‌రిలో దించుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

తాజాగా ర‌ణ‌బీర్ ధూమ్ 4 లుక్ విడుద‌ల కాగా దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఆర్కే అభిమానులు 'ధూమ్ మచేగా' అని హ్యాట్సాఫ్ చెబుతుంటే, విమర్శకులు దీనిని 'వాట్ ఎ డౌన్ ఫాల్' అని విమ‌ర్శించారు. వారి ఉద్ధేశం ధూమ్ - ధూమ్ 2, ధూమ్ 3 త‌ర్వాత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర గ్రాఫ్ ప‌డిపోయిందనేది వారి విమ‌ర్శ‌.

అయితే ర‌ణ‌బీర్ క‌పూర్ ఈ కొత్త గెట‌ప్ దేని కోస‌మో ఇంకా చిత్ర‌బృందం క‌న్ఫామ్ చేయ‌లేదు. ఇది ధూమ్ 4 కోసమా లేక యానిమల్ పార్క్ కోసమా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. గత నెలలో ధూమ్ ఫ్రాంచైజీ కోసం రణబీర్ కపూర్ YRFలో చేరినట్లు క‌థ‌నాలు రావ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెల‌కొంది. ర‌ణ‌బీర్ - యానిమల్‌కు ప్రశంసలు అందుకున్నాడు. త‌దుప‌రి పైప్‌లైన్‌లో భారీ ప్రాజెక్ట్‌లతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న నితేష్ తివారీ 'రామాయణం' కోసం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నాడు.

ఇంత‌లోనే ధూమ్ 4లో ర‌ణ‌బీర్ న‌టిస్తాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సినిమా కోస‌మో లేదా సందీప్ వంగాతో యానిమ‌ల్ పార్క్ చిత్రం కోస‌మో తెలీదు కానీ అత‌డి కొత్త లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో క‌నిపించ‌గానే అభిమానుల్లో ఒక‌టే ఉత్సాహం నెల‌కొంది. బ్లాక్ గాగూల్ ధ‌రించిన ర‌ణ‌బీర్ సూట్ లో స్టైలిష్ గా క‌నిపించాడు. ప్రఖ్యాత సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో రణబీర్ కపూర్ ఫోటోని షేర్ చేసి ''హాట్‌నెస్ అలర్ట్ !!!'' అనే శీర్షికతో షేర్ చేసాడు. కొంద‌రికి ఈ రూపం న‌చ్చినా చాలా మందికి న‌చ్చ‌లేదు.

Tags:    

Similar News