ఆర్సీ16.. అప్పుడే మొద‌లైన రూమ‌ర్లు

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో త‌న 16వ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక‌ల్ స్పోర్ట్స్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

Update: 2025-01-27 10:08 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో త‌న 16వ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక‌ల్ స్పోర్ట్స్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే మైసూరులో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా రెండో షెడ్యూల్ ను హైద‌రాబాద్‌లో మొద‌లుపెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ ఓ గెస్ట్ రోల్ లో న‌టించ‌నున్నాడ‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆల్రెడీ బుచ్చిబాబు ర‌ణ్‌బీర్ కు క‌థ చెప్పాడ‌ని, క‌థ విన‌గానే ర‌ణ్‌బీర్ ఆ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని తెలుస్తోంది.

ఆర్సీ16లో ర‌ణ్‌బీర్ ఏ పాత్ర చేయ‌డం లేద‌ని స‌మాచారం. కానీ సినిమాలో ఐదు నిమిషాల పాటూ ఉండే ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ట‌. ఆ పాత్రని ఎవ‌రైనా బాలీవుడ్ స్టార్ హీరోతో చేయించాల‌ని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అయితే ఇప్ప‌టివ‌ర‌కు చిత్ర యూనిట్ ఆ పాత్ర కోసం ఏ హీరోని క‌లిసింది లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు ఆర్సీ16లో విల‌న్ క్యారెక్ట‌ర్ కోసం కూడా ఓ స్టార్ హీరోని తీసుకోవాల‌ని బుచ్చిబాబు ట్రై చేస్తున్నాడ‌ట‌.

అంతేకాదు, యానిమ‌ల్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వ‌చ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో క‌నిపించనున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. అదే నిజ‌మైతే సినిమాకు హైప్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. మొత్తానికి సినిమా క్యాస్టింగ్ తోనే బుచ్చిబాబు సినిమాపై ఉన్న హైప్ ను పెంచేస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చ‌ర‌ణ్ ప‌ల్లెటూరి స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌లా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. దాని కోసం చ‌ర‌ణ్ త‌న‌ను తాను మ‌ల‌చుకుంటున్నాడు. ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీల‌క పాత్ర లో న‌టిస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ డిజాస్ట‌ర్ అవ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఆర్సీ16 పైనే ఉన్నాయి.

Tags:    

Similar News