ప్రైమ్ వీడియోస్‌తో రానా దగ్గబాటి డీల్?
అన్ని సినీపరిశ్రమల్లో ప్రముఖ స్టార్లు బుల్లితెర, ఓటీటీ తెరలపై హోస్ట్ లుగా కొనసాగుతున్నారు.
'కాఫీ విత్ కరణ్' షోతో కరణ్ జోహార్ నేము, ఫేము ఎంతగా దూసుకెళ్లాయో చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ హోస్ట్‌లకు ధీటుగా అంతకుమించి సెలబ్రిటీ టాక్ షోలతో చాలామంది స్టార్లు పేరు తెచ్చుకున్నారు. ఈ జాబితాలో అమితాబ్, కమల్ హాసన్, నాగార్జున, ఎన్టీఆర్ సహా పలువురు అగ్ర తారలు ఉన్నారు. నేటితరం స్టార్లు కూడా హోస్ట్ లుగా అత్యద్భుతంగా రాణించారు.
అన్ని సినీపరిశ్రమల్లో ప్రముఖ స్టార్లు బుల్లితెర, ఓటీటీ తెరలపై హోస్ట్ లుగా కొనసాగుతున్నారు. వీటిలో మెజారిటీ భాగం సెలబ్రిటీ టాక్ షోలే. అయితే ఎన్ని షోలు ఉన్నా కానీ, కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ప్రజల్లో అంతగా పాపులరైన ఏకైక సెలబ్రిటీ టాక్ షోగా ఇది రికార్డులకెక్కింది.
అయితే మళ్లీ అలాంటి ఒక షోని సౌత్ లో రీక్రియేట్ చేయడం కోసం చాలా మంది ప్రయత్నించారు కానీ ఆశించినంత రేంజుకు చేరలేకపోయారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ ట్యాలెంట్ రానా దగ్గుబాటి నంబర్ .1 యారీ లాంటి షోతో హోస్ట్ గాను రాణించాడు. ఈ షోలో తన ఇండస్ట్రీ స్నేహితులందరినీ ఇంటర్వ్యూలు చేసాడు రానా. ఓటీటీలో యావరేజ్ అనిపించుకుంది. నాలుగేళ్ల క్రితం రానా తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి పాడ్‌క్యాస్ట్‌లతో కంటెంట్ ని పుల్ చేయాలని ప్రయత్నించాడు.
ఇప్పుడు కూడా మరోసారి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలాంటి ఒక షోను హోస్ట్ చేస్తూ ఆశ్చర్యపరిచాడు రానా. ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రైమ్ వీడియో ప్రతినిధులు రానా హోస్ట్ గా టాక్ షోని నిర్మించనున్నట్టు ప్రకటించారు. ది రానా కనెక్షన్ పేరుతో సాగే ఈ షోలో ఇండస్ట్రీలో సన్నిహితులందరినీ దగ్గబాబి రానా ఇంటర్వ్యూలు చేస్తాడు. అయితే రానా పాత సీసాలో కొత్త సారాయి ఒంపుతాడా? లేక కొత్త సీసాలో పాత వైన్ నింపుతాడా? అన్నది వేచి చూడాలి.