అప్పుడు నా చావు ఖాయం అనుకున్నా...!
సావార్కర్ సినిమా కమిట్ అయిన సమయంలోనే తన ఫిజక్ అంతకు సెట్ అవ్వదు... కనుక నేను చాలా మారాలి, బరువు తగ్గాలి అనుకున్నాను
బాలీవుడ్ స్టార్ నటుడు రణదీప్ హుడా ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగ్గ పాత్రలను సినిమాలు చేయడం లేదు అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న సమయంలో స్వతంత్ర వీర్ సావర్కర్ అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన దక్కించుకుంది.
సినిమా కమర్షియల్ ఫలితం సంగతి పక్కన పెడితే అందులో రణదీప్ హుడా పాత్ర మరియు ఆ పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం గురించి ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్ ప్రధానంగా చర్చించుకున్నారు. ఆయన ఈ సినిమా కోసం తన బాడీని పూర్తిగా మార్చేసుకున్నాడు.
రణదీప్ హుడాలో నిజంగానే సావార్కర్ ను చూశాం అంటూ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో రణదీప్ సన్నని ఫిజిక్ తెగ వైరల్ అయ్యింది. 47 ఏళ్ల వయసులో ఇంతటి మార్పా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ఫిజిక్ కోసం తాను ఎంత కష్టపడ్డాను అనేది రణదీప్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సావార్కర్ సినిమా కమిట్ అయిన సమయంలోనే తన ఫిజక్ అంతకు సెట్ అవ్వదు... కనుక నేను చాలా మారాలి, బరువు తగ్గాలి అనుకున్నాను. 26 కేజీల బరువు తగ్గి నేను నా లుక్ ను మార్చుకున్నాను. నా సోదరి డాక్టర్ అవ్వడంతో ఆమె ఇచ్చిన నమ్మకం మరియు ఆమె వెనుక ఉండి తోడ్పాటు అందించడం వల్లే బరువు తగ్గాను.
ఆ సమయంలో నేను కేవలం ఖర్జూర పండు మరియు గ్లాస్ పాలు మాత్రమే తాగేవాడిని. అంతటి డైట్ ను ఫాలో అవుతున్న సమయంలో ఒకానొక సమయంలో నేను చనిపోతానేమో, మరీ ఇంతటి డైట్ వల్ల నాకు త్వరలో చావు తప్పదేమో అనుకున్నాను. కానీ కష్టపడ్డందుకు ఫలితం దక్కింది అన్నాడు.
సరైన డైట్ తో నిపుణుల సమక్షంలో బరువు తగ్గించేందుకు ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా కోసం ఇంతగా అవసరమా అని నన్ను కొందరు ప్రశ్నించారు. కానీ పాత్ర డిమాండ్ మేరకు నేను బరువు తగ్గాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.