ఈ కుర్ర హీరో ఏం చేస్తున్నాడు?
ఇక నాగశౌర్య అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేసినప్పటికీ ఇటీవల మళ్ళీ రొటీన్ గా సినిమాలు చేస్తున్నాడు అనేలా కామెంట్స్ అందుకున్నాడు.
టాలీవుడ్ లో కొంతమంది కుర్ర హీరోలు డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకొని పాన్ పాన్ ఇండియా రూట్ కి బాటలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకా లోకల్ మార్కెట్ లో పట్టు సాదించలేక పోతున్నారు. ఇంకా లవ్ స్టొరీలు రెగ్యులర్ కామెడీ కథలను టచ్ చేస్తున్నట్టు. ఇక నాగశౌర్య అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేసినప్పటికీ ఇటీవల మళ్ళీ రొటీన్ గా సినిమాలు చేస్తున్నాడు అనేలా కామెంట్స్ అందుకున్నాడు.
నాగ శౌర్యకి చివరిగా చలో సినిమాతో కమర్షియల్ సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని మూవీస్ చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. గత ఏడాది రిలీజ్ అయిన రంగబలి ఓ మోస్తరుగా పర్వాలేదని అనిపించుకుంది. అయితే ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. సరైన కథలు ఎంపిక చేసుకుంటే నాగ శౌర్యకి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
లక్ష్య అంటూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ చేసిన వర్క్ అవుట్ కాలేదు. రెగ్యులర్ జోనర్ కథల నుంచి బయటకొచ్చి కొత్త కంటెంట్ లపై నాగ శౌర్య దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పీరియాడిక్ ట్రెండ్ నడుస్తోంది. దానికి తగ్గట్లుగానే పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో వస్తే బాగుంటుందని అంటున్నారు.
నాగ శౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా రంగబలి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. కామెడీ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. రంగబలి తర్వాత నాగ శౌర్య ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. చాలా కథలు వింటున్న కూడా ఎందుకనో ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు.
అయితే మళ్ళీ పవన్ బాసంశెట్టి దర్శకత్వంలోనే నాగ శౌర్య కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. అలాగే తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ లోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సారి చేయబోయే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేయడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు.
మరి పవన్ బాసంశెట్టితో ఈ సారి నాగ శౌర్య ఎలాంటి సినిమా చేస్తాడనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. రంగబలితో రొటీన్ కథని చెప్పిన పవన్ ఈ సరైన కాస్తా స్ట్రాంగ్ కంటెంట్ ని రిప్రజెంట్ చేస్తాడేమో అనేది చూడాలి. నాగ శౌర్య ఈ సారైన కథల ఎంపికలో ఆలోచన మార్చుకొని బెస్ట్ కంటెంట్ తో వస్తాడేమో చూడాలి.