స్టార్ హీరోయిన్ ను కంగారు పెట్టేసిన బుడ్డోడు.. సడెన్ షాక్
అందుకు కొన్ని సార్లు బాగా కష్టపడుతుంటారు కూడా! ఆ సమయంలో వివిధ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి.
హీరో హీరోయిన్లు ఎక్కడైనా కనిపిస్తే చాలు.. పెద్ద వాళ్ల నుంచి పిల్లల వరకు అందరూ వారిని చూసేందుకు ఎగబడుతుంటారు. సెలబ్రిటీలు ఎక్కడికైనా వస్తారని తెలిసినా.. వెళ్లి మరీ వారి కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడంతా వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ట్రై చేస్తున్నారు. అందుకు కొన్ని సార్లు బాగా కష్టపడుతుంటారు కూడా! ఆ సమయంలో వివిధ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 90స్ లో బీ టౌన్ లో ఓ వెలుగు వెలిగారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్నో మంచి హిట్స్ అందుకున్నారు. ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగా.. నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత.. అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు రాణి ముఖర్జీ.
అయితే తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన రాణి ముఖర్జీని ఓ బుల్లి ఫ్యాన్ కంగారు పెట్టేశాడు. వేడుకకు హాజరైన ఆమె.. పిల్లలతో సెల్ఫీలు దిగారు. ఒక్కో కిడ్ వరుసగా వచ్చి రాణితో సెల్ఫీ తీసుకున్నారు. సరదాగా పలకరిస్తూ గడిపారు. ఆ సమయంలో వచ్చిన ఓ బుడ్డోడు.. ఒక్కసారిగా ఆమె భుజంపై చేయి వేసి దగ్గరకు ఆమెను లాగుదామని ట్రై చేశాడు. దీంతో రాణి సడెన్ గా షాకైంది. ఆ తర్వాత బుడ్డోడు సెల్ఫీ సరిగ్గా తీయకపోవడంతో.. రాణినే ఫోటో దింపింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అడోరబుల్ మూమెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్కసారిగా బ్యూటీకి బుడ్డోడు షాక్ ఇచ్చాడని చెబుతున్నారు. క్యూటెస్ట్ సెల్ఫీ ఫర్ ఎవర్ అంటూ పొగిడేస్తున్నారు. బుల్లి ఫ్యాన్ మూమెంట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక.. రీసెంట్ గా రాణి ముఖర్జీ ప్రతిష్ఠాత్మక ఐఫా అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే మూవీలో తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం చేసే తల్లిగా కనిపించి ఆమె సినీ ప్రియుల్ని కంటతడి పెట్టించారు. ఆ సినిమాలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా పురస్కారం దక్కింది. వాస్తవిక ఘటనల ఆధారంగా ఆషిమా ఛిబ్బర్ తెరకెక్కించిన ఆ లేడీ ఓరియెంటెడ్ మూవీ మంచి హిట్ గా నిలిచింది.