ఒకరిని అదృష్టం వెంటాడుతుంటే.. మరొకరిని దెయ్యం వెంటాడుతోంది!
ఈ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. ఒకరు రణబీర్ కపూర్ .. మరొకరు రణవీర్ సింగ్. ఈ ఇద్దరికీ పోలికలు చూస్తే ఇటీవల కెరీర్ పరంగా రణవీర్ చాలా తంటాలు పడుతున్నాడు.
బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరుగా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఆ ఇద్దరు కథానాయకులు ప్రతిభావంతులైన అగ్ర కథానాయికలను పెళ్లాడారు. ఆ ఇద్దరూ తండ్రులు అయ్యారు. వారసులు జన్మించారు. అయితే ఆ ఇద్దరు హీరోల్లో ఒకరి కెరీర్ ధేధీప్యమానంగా వెలిగిపోతుంటే, మరో హీరో కెరీర్ మాత్రం నానాటికీ దిగజారడం కలవరపెడుతోంది.
ఈ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. ఒకరు రణబీర్ కపూర్ .. మరొకరు రణవీర్ సింగ్. ఈ ఇద్దరికీ పోలికలు చూస్తే ఇటీవల కెరీర్ పరంగా రణవీర్ చాలా తంటాలు పడుతున్నాడు. సరైన సోలో విజయం దక్కకపోవడంతో అతడి ఇమేజ్ అంతకంతకు దిగజారుతోంది. ఈపాటికే ప్రారంభం కావాల్సిన డాన్ 3 ప్రోగ్రెస్ గురించి సరైన అప్ డేట్ లేదు. మేకర్స్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారో లేదో కూడా తెలీదు. పైగా తొలి రెండు భాగాల్లో నటించిన షారూఖ్ అభిమానులు డాన్ 3లో హీరో మారడంతో అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు రీమేక్ కూడా రద్దయింది. వెరసి ఇవన్నీ స్టార్ హీరోకి మైనస్ గా మారాయి.
అయితే సహచర హీరో రణబీర్ కపూర్ కెరీర్ గ్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కుమార్తె రాహా జన్మించాక అతడి ఫేట్ అమాంతం మారింది. ఇప్పుడు అతడు పాన్ ఇండియన్ స్టార్ గా సుపరిచితం. సందీప్ వంగాతో యానిమల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారడంతో రణబీర్ పేరు మార్మోగింది. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఉత్తమ దశలో ఉన్నాడు. భన్సాలీతో లవ్ అండ్ వార్ సహా యానిమల్ 2లోను రణబీర్ నటించనున్నాడు. ఈ రకంగా ఒకరిని అదృష్టం వెంటాడుతుంటే.. మరొకరిని దెయ్యం వెంటాడుతోంది! ఒకరిని పాజిటివ్ ఫోర్స్ వెంటాడుతుంటే, మరొకరని నెగెటివ్ ఫోర్స్ వెంటాడుతోంది.