సందీప్ వంగా ప్రభావం గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
'యానిమల్ కా బాప్' రణవీర్ సింగ్ వైరల్ 'సర్దార్ లుక్' అంటూ హిందీ ఎంటర్ టైన్ మెంట్ మీడియా ప్రచారం చేస్తోంది.
తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 917 కోట్లు వసూలు చేసింది. రణబీర్ కపూర్ లాంటి స్టార్ కి మొదటి పాన్ ఇండియన్ హిట్‌ని అందించిన ఏకైక దర్శకుడిగా తెలుగువాడైన సందీప్ వంగా పేరు మార్మోగింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ లాంటి హీరోకి మొదటి 100 కోట్ల క్లబ్ సినిమాని అందించిన దర్శకుడు కూడా సందీప్ వంగానే. అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్'తో ఈ ఫీట్ సాధించగలిగాడు షాహిద్. ఒక హైదరాబాదీ సాధించిన విజయాలుగా గర్వంగా చెప్పాలి. అతడి సినిమాలపై కొన్ని విమర్శలు ఉన్నా కానీ, 1000 కోట్లు కొల్లగొట్టాడా లేదా? అన్నదే ప్రజలు ప్రధానంగా చర్చిస్తున్నారు. పాన్ ఇండియాను కొట్టడమే నేటి దర్శకుల ఏకైక లక్ష్యం. దానిని సందీప్ వంగా తాను తెరకెక్కించిన తొలి మూడు సినిమాలతోనే సాధించి చూపించాడు.
సందీప్ వంగా ప్రభావం బాలీవుడ్ పై ఏ స్థాయిలో ఉందో నిరూపించేందుకు ఇప్పుడు ఆదిత్య ధర్ 'ధురంధర్' సెట్స్ నుండి లీకైన రణ్ వీర్ సింగ్ ఫోటోగ్రాఫ్ ప్రూఫ్ గా మారింది. 'యానిమల్ కా బాప్' రణవీర్ సింగ్ వైరల్ 'సర్దార్ లుక్' అంటూ హిందీ ఎంటర్ టైన్ మెంట్ మీడియా ప్రచారం చేస్తోంది. అంటే దీనర్థం 'యానిమల్'ని ఎవరైనా ఫాలో కావాల్సిందేనని. ఈ క్రెడిట్ కచ్ఛితంగా సందీప్ వంగాకే చెందుతుంది.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, సింగం 3 తర్వాత ఆదిత్య ధర్ గూఢచారి చిత్రం 'ధురంధర్'లో రణవీర్ నటిస్తున్నాడు. రణవీర్ సింగ్ తలపాగా, రక్తంతో పూసిన కుర్తా, సూట్‌లో ఉన్న కొన్ని పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు అతడిని యాక్షన్-ప్యాక్డ్ అవతార్ చూడగానే యానిమల్ గుర్తుకు వస్తోంది. అతడు కూడా రణబీర్ లుక్ నే ఫాలో చేస్తున్నాడని అర్థమవుతోంది. దురంధర్ లో కూడా యానిమల్ తరహా యాక్షన్ సీన్లను చూడాల్సి ఉంటుందని అర్థమవుతోంది. ధురంధర్ కి 'యూరి -సర్జికల్ స్ట్రైక్స్' ఫేం ఆధిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. అతడి ప్రతిభపై నమ్మకం ఉన్నా.. ఇప్పుడు యానిమల్ స్ఫూర్తి నెటిజనుల్లో చర్చగా మారింది.
సందీప్ వంగా సిక్కుల కథలతోనే వందల కోట్లు కొల్లగొడుతున్నాడు. దేశవ్యాప్తంగా అతడి సినిమాలు సంచలనాలు సృష్టించడానికి సిక్కుల పాత్రలే మూలాధారం. ఇప్పుడు అదే సిక్కు పాత్రను పోషిస్తున్నాడు రణ్ వీర్ సింగ్. సహజంగానే రణ్ వీర్ సింధి కుటుంబానికి చెందిన వాడు. పంజాబీ క్రిస్టియానిటీ మూలాలు కూడా ఉన్నాయి. పంజాబీ గన్ కల్చర్ కూడా 'దురంధర్' సెట్స్ నుంచి లీకైన ఫోటోల్లో కనిపిస్తోంది.
అయితే ఇది యానిమల్‌ని కాపీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక నెటిజన్ స్పందిస్తూ, ''రణ్‌వీర్‌సింగ్ గజబ్ భాయ్ యానిమల్ కా బాప్#ధురంధర్ 500 కోట్ల నెట్'' అని రాసాడు. దీనిని బట్టి ప్రజలు ఈ సినిమాని యానిమల్ తో పోల్చి చూస్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి. సందీప్ వంగా ప్రభావం గురించి ఇంతకంటే ఇంకేం చెప్పాలి?