డీప్ ఫేక్ పై రంగంలోకి హీరో
తాజాగా ఈ వీడియోకి సంబంధించి రణవీర్ సింగ్ చర్యలకు దిగాడు. డీఫ్ పేక్ వీడియోల్ని ఉద్దేశించి 'సో బచ్ దోస్తో' అంటూ వ్యాఖ్యానించాడు.
డీప్ పేక్ వీడియోలు సెలబ్రిటీల్ని ఎంతగా ఇబ్బంది పెడతున్నాయో తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఓ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి నెట్టింట వదిలారు. అది వైరల్ గా మారింది. చూసిన వారంతా ఆ పనిచేసింది అమీర్ ఖానా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. దీంతో అదంతా అవాస్తవమంటూ..ఏపార్టీ తరుపున తాను ప్రచారం చేయలేదని అమీర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అటుపై రణవీర్ సింగ్ కూడా డీప్ పేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవల్సిందిగా ఆ వీడియోలో ఉంది. రణవీర్ సింగ్ వారణాసిలో పర్యటించిన వీడియోనే పేక్ ఐడీతో క్రియేట్ చేసి జనాల్లోకి వదలడంతో అది సంచలనంగా మారింది.
తాజాగా ఈ వీడియోకి సంబంధించి రణవీర్ సింగ్ చర్యలకు దిగాడు. డీఫ్ పేక్ వీడియోల్ని ఉద్దేశించి 'సో బచ్ దోస్తో' అంటూ వ్యాఖ్యానించాడు. తనపై వచ్చిన ఫేక్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించాడు.
వీలైనంత త్వరగా నిందుతుల్ని పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు. రణవీర్ కి మద్దతుగా ఆయన అభిమానులు నిలుస్తున్నారు. ఫిర్యాదుతో పోలీసులు ఆరెస్ట్ అయ్యారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు ఇంకెంత మంది హీరోలు డీప్ పేక్ బారిన పడతామో అంటూ టెన్షన్ పడుతున్నారు. మార్కెట్ లో డీప్ పేక్ అనేది ఓ దందాగా తయారైంది. ఏఐ టెక్నాలజీతో ఇష్టారీతున వీడియోలు చేయడం..స్వలాభం కోసం వాటిని మార్కెట్ లోరిలీజ్ చేసి చెడు అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నాన్ని అన్ని పరిశ్రమల హీరోలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
రష్మిక మందన్నా పేరుతో ఓ అసభ్య వీడియో ఆమధ్య రిలీజ్ అయి ఎంత సంచలనమైందో తెలిసిందే. దీంతో సైబర్ క్రైమకి ఫిర్యాదు చేయడంతో అప్రత్తమైన పోలీసులు వారం తిరగకుండా నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయినా డీప్ ఫేక్ కి అడ్డుకట్ట పడలేదు. రష్మిక అనంతరం మరికొంత మంది హీరోయిన్లపైనా ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.